pawan says it's dangerous to travel with chandrababu బాబుతో ప్రయాణం ప్రమాదకరం: పవన్

Pawan kalyan attacks national parties for ap bifurfication

pawan kalyan, janasena, chennai, tamil nadu, BJP, Congress, TDP, JSP, Kamal Hassan, andhra pradesh, politicspawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan kamal hassan meet, Pawan Kalyan chennai yatra, Pawan Kalyan south indian politics, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan alleges Travelling with Andhra pradesh Chief Minister Chandrababu Naidu is dangerous.

ఆంధ్రప్రదేశ్ హోదా విషయంలో మాట తప్పిన బీజేపి: పవన్

Posted: 11/21/2018 06:58 PM IST
Pawan kalyan attacks national parties for ap bifurfication

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు చంద్రబాబు గొప్ప వ్యక్తి అని చెబుతూనే... ఆయనపై సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు స్నేహితుడిగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని అన్నారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా గత ఎన్నికలలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించానని... కానీ, తాను ఆశించిన ప్రయోజనాలేమీ చూకూరలేదని విమర్శించారు.

చెన్నైలో సీనియర్ హీరో, రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ ను కలసిన తరువాత ఆయన ఇవాళ చెన్నైలో మీడియాతో మాట్టాడుతూ ‘ఎల్లారుకుం వణక్కం' అంటూ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. ఏపీ విభజన సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన పేరు పవన్ కల్యాణ్ అని, 2014లో జనసేన పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఇరవై ఏళ్లు చెన్నైలో ఉన్నానని, తన తమిళంలో ఏవైనా తప్పులుంటే క్షమించాలని కోరారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుచేశారు.

మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి బాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడేందుకు అప్పట్లో ఏపీ విడిపోయిందని, అయితే తెలంగాణ విడిపోవడం మాత్రం ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు కావడానికి జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న విధానాలనే కారణమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ క్రమంలో అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తుందన్న అశ, నమ్మకం, ఎన్నికల హామీ నేపధ్యంలో బీజేపిని సమర్థిస్తే.. ప్రత్యేక హోదా విషయంలో కూడా మాట తప్పారని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.

ఎన్నో ఆశలతో ఏపీలో చంద్రబాబును సమర్థించాం కానీ, టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి ఏపీని బాధిస్తోందని, అందుకే, రాజకీయాల్లో మార్పు రావాలని, దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు గురించి పవన్ ప్రస్తావించారు. ఈ క్రీడ కోసం తమిళులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, యువత ముందుకొస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలదో చెప్పడానికి ఈ పోరాటమే నిదర్శనం అన్నారు. ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణాదిలో ఉద్యమం రావాలని పవన్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chennai  tamil nadu  BJP  Congress  TDP  JSP  Kamal Hassan  andhra pradesh  politics  

Other Articles