congress dares MIM to prove allegations అసద్ కు మహేశ్వర్ రెడ్డి సవాల్: నిరూపిస్తే రాజకీయ సన్యాసం

Maheshwar reddy dares asaduddin owaisi to prove allegations

Telugu Desam Party, Telangana polls, AIMIM, Asaduddin Owaisi, Congress, Maheshwar Reddy, allegations, mahakutami, BJP, Telangana, Politics

Congress party leader Maheshwar Reddy said, "Yesterday, I filed my nomination in front of 60,000 people present in the crowd and today, he came here with no more than 300-400 people in his rally.

అసద్ కు మహేశ్వర్ రెడ్డి సవాల్: నిరూపిస్తే రాజకీయ సన్యాసం

Posted: 11/20/2018 09:28 PM IST
Maheshwar reddy dares asaduddin owaisi to prove allegations

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో తాను మాట్లాడినట్టు ప్రచారంలో ఉన్న అడియో టేపుల్లో వున్న గొంతు తనది కాదని నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఓటమిని జీర్ణంచుకోలేక టీఆర్ఎస్ అడిస్తున్న నాటకాలలో ఇది ఓ నాటకమని ఆయన చెప్పుకోచ్చారు. ఆ టేపులు టీఆర్ఎస్ సృష్టించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా కానీ, తన వాయిస్ కానీ ఇందులో లేదనే విషయం స్పష్టమైందని వివరించారు. తాను మాట్లాడినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కూడా సిద్దమని సవాల్ విసిరారు.

సరైన ఆధారాలు లేకుండా తనపై అరోపణలు చేయడం సముచితం కాదని అన్నారు. అసలు అసదుద్దీన్ ఓవైసీని తాను ఎప్పుడు కలవలేదని చెప్పుకోచ్చిన ఆయన ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయనను చూశానని చెప్పారు. అలాంటి వ్యక్తిని తాను ఫోన్ లో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నానంటే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఈ వివాదాన్ని సృష్టిస్తున్నాయని.. అందులో తనను ఇరికించాలని చూస్తున్నాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఒక పార్టీ అధ్యక్షుడు కేవలం రూ. 25 తీసుకుని తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మైనార్టీ ఓట్లు అడిగే దమ్ములేకే ఓవైసీని తెచ్చారని విమర్శించారు. ఓవైసీ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిర్మల్ లో తమ పార్టీ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టని ఎంఐఎం పార్టీ.. గత ఎన్నికలకు ముందు ఇక్కడి వచ్చిన బీఎస్పీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన అసద్.. ఈ సారి ఇక్కడకు వచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారని మహేశ్వర్ రెడ్డి పేర్కోన్నారు.

నిన్న తన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ సహా మహాకూటమి మద్దతు పలుకుతూ సుమారు 60 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలిరాగా, వారందరితో కలసి ర్యాలీగా వెళ్లిన తాను తన నామినేషన్ ను దాఖలు చేశానని చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం ఇదే తొలిసారని పేర్కోన్నారు. అదే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు తరలివస్తే కనీసం 3 నుంచి నాలుగు వందల మంది కూడా హాజరుకాలేదని.. దీంతో తనను ఢీకొనే ధైర్యం లేక అసద్ చౌకబారు అరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles