woman cheating in pretext of marriage పంచాలిని మించిన పడతి.. మౌనిక పట్టుబడిందిలా..

Woman cheating in pretext of marriage held in kadapa

mounika, gold ornaments, prakasham panchali, anantha reddy, moinuddinapuram, young lady marries six men, women cheating by marriage, prakasam dist, cheating lady mounika, media, crime

A woman Mouniuka from moinuddinapuram of prakasam district, Andhra Pradesh cheating young men in pretext of marriage and married six men. She used to abscond with gold ornaments after few days of marriage.

పాంచాలిని మించిన పడతి.. మౌనిక పట్టుబడిందిలా..

Posted: 11/20/2018 03:33 PM IST
Woman cheating in pretext of marriage held in kadapa

పైన దగా, కింద దగా, కుడిఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ మాటలనే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో తెలియదు కానీ.. ఓ యువతి మహాభారతంలోని ఐదుగురు పతులను పెళ్లాడిన ద్రౌపతిని మించిపోయింది. మరో విధంగా చెప్పాలంటూ పాంచాలి రికార్డును అధిగమించింది. ఆనాడు అమ్మ మాట తప్పని పాండవులకు ద్రౌపతి పాంచాలిగా మారగా.. నేడు తండ్రి సాయంతో తన పేదరికం నుంచి తప్పించుకునేందుకు ఈ యువతి పాంచాలని మించిపోయింది. ఏకంగా ఆరుగురు యువకులను పెళ్లాడింది. అదెలా అంటున్నారా..

పేదవాళ్లం కట్నం డబ్బులు వగైరాలు ఇచ్చుకోలేం.. అంటూ వారి కుటుంబాలతో సంబంధాలను కలుపుకుని పెళ్లి చేసుకుంటుంది. అతడి వద్ద కొద్ది రోజుల గడిపి, ఇంట్లో బంగారు అభరణాలను తన టార్గెట్ గా ఎంచుకుంటుంది. దొరికినంత దోచుకుని ఇక ఆ ఇంటి నుంచి ఉడాయిస్తుంది. ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసినా.. వారు తమ పరువు ఎక్కడ పోతుందోనని అందోళన చెందారు. అయితే తాజాగా ఈ యువతి చేతిలో మోసపోయిన అరో భర్త ఇచ్చిన ఫిర్యాదు అమెను పట్టించింది.

పోలీసులనే నివ్వెరపోయేల చేసిన ఈమెకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా మొయిద్దీనాపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికరెడ్డి (20)కి కడప జిల్లా కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి (38)తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే మౌనికను చూడటానికి ఆమె తండ్రి కొమ్ములూరు వచ్చాడు. తాను తండ్రితో కలిసి పుట్టినింటికి వెళ్లి, రెండు రోజులు ఉండి వస్తానని భర్తకు చెప్పి మౌనిక ఒప్పించింది.

దీనికి అతడు అంగీకరించడంతో ఎనిమిది తులాల బంగారం, రూ.30వేల నగదు బ్యాగులో సర్దుకొంది. భార్యను, మామను స్వయంగా బాధితుడు బస్సు ఎక్కించాడు. అలా, అతడికి టాటా చెప్పి బస్సు ఎక్కిన మౌనిక మళ్లీ తిరిగి రాలేదు. మామకి ఫోన్‌ చేస్తే, స్పందన లేకపోవడంతో కంగారుపడిపోయిన భర్త, ఈ నెల 10న ఖాజీపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య చాలా మంచి వ్యక్తని, ఆమెను ఎవరో అపహరించారని వాపోయాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, మౌనిక ఆచూకీ కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లి ఆరా తీశారు.

మౌనిక గురించి అసలు విషయం తెలిసిన పోలీసులు నివ్వెరపోయారు. మౌనికకు అప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు పోలీసులు విచారణలో తేలింది. పెళ్లి చేసుకోవడం, అత్తారింట్లో కొద్దిరోజులు గడిపి, అదునుచూసి కొంత బంగారం మూటగట్టుకొని పుట్టింటికని చెప్పి వచ్చేసేదని గుర్తించారు. కడప యువకుడు రామకృష్ణారెడ్డితోపాటు గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలకు చెందిన యువకులను కూడా మోసగించి, బంగారంతో ఉడాయించినట్టు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో తండ్రి, ఆమె ప్రియుడు సహకరించినట్టు పోలీసులు తేల్చారు.

ఈ ముగ్గురూ కలిసి యువకులను బుట్టలో వేసుకునేందుకు వ్యూహం రచించేవారు. ఇందులో భాగంగా, అనంతరెడ్డి, మౌనికలు మ్యారేజ్‌ బ్యూరోలకు వెళ్లి... కట్నం కానుకలతో సంబంధం లేకుండా, అమ్మాయి బాగుంటే చాలనే అభిప్రాయంతో ఉండే యువకుల చిరునామాలను సంపాదించేవారు. తండ్రీ కూతుళ్లు వారిని వెతుక్కొంటూ వెళ్లి, తమ కట్టుకథలతో యువకులు ఆకట్టుకుని పెళ్లికి అంగీకరించేలా చేసేవారు. దీంతో, పైసా కట్నం లేకుండా పెళ్లిచేసుకునేవారు. కొద్దిరోజులు అత్తారింట్లో తనపై ఎవరికీ అనుమానం రాకుండా మౌనిక ప్రవర్తించేది. ఆ తరువాత, తండ్రి రావడం, పుట్టింటికని బయలుదేరడం షరామామూలే. ఇద్దరికి మాత్రం విడాకులిచ్చింది.

అత్తింటి నుంచి రాగానే ప్రియుడు నాయక్ తో హైదరాబాద్‌ చెక్కేసి కొద్దిరోజులు అక్కడి గడిపి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడేది. అత్తారింటి నుంచి వెళుతూ ఒకటి, రెండు తులాల బంగారం తీసుకెళుతుండటంతో ఆమెపై ఎవరికీ అనుమానం కలగలేదు. దీనికి భిన్నంగా రామకృష్ణారెడ్డి ఇంట్లోంచి నుంచి వచ్చినప్పుడు 8 తులాల బంగారం, నగదు తీసుకెళ్లడంతో మౌనిక బండారం బయటపడింది. ఇటీవలే ప్రియుడు నాయక్ తో ఆమెకు వివాహం జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ప్రియుడిని, మైదుకూరులో మౌనిక, అనంతరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mounika  gold ornaments  prakasham panchali  anantha reddy  moinuddinapuram  six marriages  media  crime  

Other Articles