Jagan seeks central probe into attack on his life దాడి కేసులో కోర్టుకు జగన్: చంద్రబాబును ప్రతివాదిగా పిటీషన్

Jagan attack case hyderabad hc to hear pil on november 6

YS Jagan, YS Jagan attacked, High court, YS Jagan High court, YS Jagan Pawan Kalyan, ys jagan vizag airport attack, YS Jagan Governor, YS Jagan Mohan Reddy, Governor Narsimhan, YS Jagan, roja, GVL narsimha rao, chinarajappa, nara lokesh, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

The Hyderabad HC to hear YS Jagan Mohan Reddy Petition on November 1st which was moved seeking a CBI probe into an attempt to kill YSR Congress president Y.S. Jagan Mohan Reddy.

దాడి కేసులో కోర్టుకు జగన్: చంద్రబాబును ప్రతివాదిగా పిటీషన్

Posted: 10/31/2018 08:46 PM IST
Jagan attack case hyderabad hc to hear pil on november 6

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. తనపై విశాఖలో జరిగిన హత్యాయత్నంపై కోర్టును ఆశ్రయించారు. కుట్రలో భాగంగానే దాడి జరిగిందని.. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉందని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఏపీ సర్కార్ కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చారు జగన్. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను జగన్ ప్రస్తావించారు. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులు వాంగ్మూలం కోసం వచ్చారని.. సిట్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. ఏపీ పోలీసులుపై నమ్మకం లేదనందుకే స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. అలాగే దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఏపీ డీజీపీ, సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాననే తనపై కుట్ర చేశారన్నారు జగన్. ప్రజా సంకల్ప యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి.. ఓర్వలేకే దాడి చేయించారని పేర్కొన్నారు.

ఏపీ డీజీపీ, ప్రభుత్వం కనుసన్నలో సిట్ విచారణ జరుగుతోందని.. అందుకే థర్డ్ పార్టీ విచారణ కోరుతున్నామన్నారు జగన్. శ్రీనివాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న లేఖలో కూడా మూడు చేతి రాతలు ఉన్నాయని.. దాడి సమయంలో కూడా నేరుగా తన మెడను టార్గెట్ చేశాడని జగన్ తెలిపారు. తాను ప్రతిఘటించడంతో భుజానికి గాయమయ్యిందని.. తనపై హత్యాయత్నం జరిగిందని స్వయంగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఉందని ప్రస్తావించారు. ఈ కేసును త్వరగా క్లోజ్ చేయడానికి నార్త్ విశాఖ ఏసీపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌పై జరిగిన దాడి ఘటనపై గతంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటూ.. కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ దాడి కేసులో నిస్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించాలని.. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ పిటిషన్లు వేశారు. అవి విచారణలో ఉండగానే.. జగన్ మరో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. శ్రీనివాసరావుతో పాటూ అతడి స్నేహితులు, ఈ కేసులో కీలకమైన మరికొందర్ని కూడా బుధవారం ప్రశ్నించారు. పిడుగురాళ్ల మండలం పాతగణేశునిపాడులో నాగూర్ వలీ అనే వ్యక్తిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. శ్రీనుతో నాగూర్‌వలీ ఫోన్‌లో సంభాషణలు జరిపినట్లు ఆధారాలు ఉండటంతో అతడ్ని ప్రశ్నించారు. నాగూర్ వలీ అక్క సైదాబిని కనిగిరిలో సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే శ్రీనివాస్‌ను తమకు చూపించాలని నిందితుడి తల్లిదండ్రులు సిట్‌ను కోరడంతో.. వారిని విశాఖ తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  chandrababu  High Court  CBI  Central police forces  crime  

Other Articles