Mahakutami partners fuming at Cong. over 'list leak' ప్రజాకూటమి సీట్ల సర్థుబాటుపై అన్ని ఊహాగానాలే

Mahakutami partners fuming at cong over list leak

Uttam Kumar, TPCC president, kodandaram, L.Ramana, chada venkat reddy, Prajakutami, Congress, CPI, TTDP, TJS, Telangana, politics

Leaders of the three partners of Mahakutami, met at the house of CPI leader, Chada Venkat Reddy to discuss about the happenings in Congress. They are resenting the independent attitude of the Congress, while keeping their positions in suspense.

ప్రజాకూటమి సీట్ల సర్థుబాటుపై అన్ని ఊహాగానాలే: కోదండరామ్

Posted: 10/31/2018 03:32 PM IST
Mahakutami partners fuming at cong over list leak

తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా ప్రజాకూటమిలోని మిత్ర పార్టీల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని వస్తున్న వార్తలను టీజేఎస్ అధినేత కోదండరామ్ తోసిపుచ్చారు. తాము ప్రజాకూటమిపై కోపంగా ఉన్నామని... మహాకూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయని వినిపించిన వార్తలు సత్యదూరమని ఆయన అన్నారు. ఈ సత్యదూరపు వార్తలను సృష్టించి ప్రజలను అయోమయంలోకి నెట్టేదెవరో ప్రజలందరికి తెలుసున్నారు.

ప్రజా కూటమిలో ఎప్పుడు ప్రస్తావనకు రాని అంశాలను తెరపైకి తేవడం పట్ల అవేదన వ్యక్త చేశారు. తమ టీజేఎస్ పార్టీ ప్రజాకూటమిలోనే కొనసాగుతుందని కోదండరామ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు అంశంపై తాము ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. మహాకూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ దే అని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే కూటమిని ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలో వున్నందను హైదరాబాదులో జరిగిన ప్రజాకూటమి సమావేశానికి హాజరుకాలేకపోయారని కోదండరామ్ అన్నారు.

అనంతరం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణలోని టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారని... ఏమీ చేయకుండానే మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాము కన్నెర్ర చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలసిపోతుందని చెప్పారు.

ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తామంతా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. తమ మేనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. విపక్ష నేతలను భయపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా కూటమిలో ఎలాంటి అభిప్రాయబేధాలు, వివాదాలు లేవని తేల్చిచెప్పారు. ఇక డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttam Kumar  kodandaram  L.Ramana  venkat reddy  Prajakutami  Telangana  politics  

Other Articles