SC orders CVC inquiry into CBI director Alok Verma సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ పరిపాలనకు మాత్రమే..

Sc sets deadline for probe into cbi chief alok verma retired judge to oversee

Nageshwar Rao, M Nageshwar Rao, alok verma, rakesh asthana, Supreme court, interm cbi director, cbi boss, interim cbi chief, new cbi director, CBI chief, new CBI chief, retired Judge AK Patnaik, Central vigilance commission, investigation

The Central Vigilance Commission investigation against CBI director Alok Verma will be conducted under the supervision of a retired top court judge, the Supreme Court said and set a two-week deadline for this probe to be completed.

అలోక్ వర్మ పిటీషన్ పై ‘సుప్రీం’ విచారణ: కేంద్రం, సీవీసీలకు నోటీసులు

Posted: 10/26/2018 02:59 PM IST
Sc sets deadline for probe into cbi chief alok verma retired judge to oversee

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక అదేశాలను జారీ చేసింది. సీబిఐ చీఫ్ గా ఆయనపై అవినీతి అభియోగాలు నమోదయ్యాయన్న నేపథ్యంలో అయనపై కేంద్రం విధించిన బలవంతపు సెలవు వేటుపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను తమకు అందజేయాలని అదేశించింది. ఈ నేపథ్యంలో సీవీసి తరపు న్యాయవాది మూడు వారాల సమయం కావాలని కోరగా, సుప్రీం ధర్మాసనం తొలుత కేవలం పది రోజుల సమయాన్ని కేటాయించగా, తరువాత రెండు వారాల సమయాన్ని ఇచ్చింది.

తనను బలవంతంగా సెలపుపై పంపేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను సవాల్‌ చేస్తూ ఆలోక్‌ కుమార్ వర్మ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ సుప్రీం విచారించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం. జోసెఫ్ లతో కూడిన  సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా అటు కేంద్రానికి ఇటు సీబిఐ, సీవీసీలకు నోటీసులను అందజేసింది. ఈ సందర్బంగా అలోక్ వర్మపై జరిగే పూర్తి విచారణను మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలోనే కొనసాగించాలని న్యాయస్థానం నిర్ణయించింది.

ఇక సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. రోజువారీ కార్యకలాపాలు, పరిపాలనా పరమైన పర్యవేక్షణకు మాత్రమే పరిమితమవ్వాలని సూచిస్తూ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం వెలువరించింది. ఈ నెల 23వ తేదీన సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను సీల్డ్‌ కవర్‌ ద్వారా తమకు తెలియబరచాలని ధర్మాసనం అదేశాలను జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.

సీబీఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తిని అర్థరాత్రి అనూహ్య నిర్ణయాలతో బలవంతంగా సెలవుపై వేళ్లాలని అదేశాలను జారీచేయడం ఏంటని ప్రశ్నించిన త్రిసభ్య ధర్మాసనం.. తద్వారా అనేక కేసులపై దీని ప్రభావం ఎందుకు ప్రభావితం చూపదో తెలపాలని అదేశించింది. అంతేకాదు.. చాలా సున్నితమైన, సంచలనాత్మకమైన కేసుల్లో సైతం మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయని అలోక్ వర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లన విషయం పట్ల కూడా వివరణ కోరింది.

నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడిచే ఏర్పడిన కమిటీ.. డైరెక్టర్ నియామకం చేపడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా.. ఆలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలను పంపించడంపై సిట్ వేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ ను కూడా ఆలోక్ వర్మ పిటిషన్ తో కలిపి ధర్మాసనం విచారించింది. రెండూ ఒకే అంశానికి చెందినవి కావడంతో రెంటినీ కలిపి విచారించి నవంబర్ 12కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alok Verma  CBI  CBI feud  CVC  M Nageswar Rao  Rakesh Asthana  Supreme Court  retired Judge AK Patnaik  

Other Articles