Chandrababu vows to thwart ‘political dramas’ ‘‘జగన్ పై దాడితో రాష్ట్రంలో అలజడికి కేంద్రం ప్లాన్’’

Chandrababu sees centre s hand behind attack on ys jagan vows to thwart political dramas

YS Jagan, YS Jagan attacked, Chandrababu, KCR, nara lokesh, Titli, somi reddy, YS Jagan Pawan Kalyan, ys jagan vizag airport attack, YS Jagan Governor, YS Jagan Mohan Reddy, Governor Narsimhan, YS Jagan, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh,

AP CM Chandrababu fumed at the Centre accusing it of playing dirty game with the state. He was referring to the attack on opposition leader YS Jagan at Visakhapatnam airport.

‘‘జగన్ పై దాడితో రాష్ట్రంలో అలజడికి కేంద్రం ప్లాన్’’: చంద్రబాబు

Posted: 10/26/2018 02:03 PM IST
Chandrababu sees centre s hand behind attack on ys jagan vows to thwart political dramas

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కేంద్ర బలగాలు సీఐఎస్ఎఫ్ పరిధిలో వుండే విమానాశ్రయంలో కావాలనే ప్రాణహాని లేని దాడి చేసి ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో అలజడి సృష్టించి.. భయాందోళన వాతావరణాన్ని తీసుకురావాలని కేంద్రం ప్లాన్ చేస్తిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని అరోపించారు.

రాష్ట్రంలోకి గూండాలను రప్పించి అరాచకం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవసరమైతే రాజ్యాంగేతర శక్తులను కూడా రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సందేహాలు వ్యక్తం చేశారు.  ఆపరేషన్ గరుడ స్క్రిప్టులో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందన్నారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఘటనపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీరు కూడా అక్షేపనీయంగా వుందని అభిప్రాయపడ్డారు. ఘటన జరిగిన క్షణాల వ్యవధిలోనే గవర్నర్ నరసింహన్ రాష్ట్ర డీజీపీతో మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.

గవర్నర్ నరసింహన్ నేరుగా అధికారులతో మాట్లాడితే.. ఇక ముఖ్యమంత్రిగా తానెందుకని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ కేంద్రానికి గూఢచారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థపై మరోమారు పునరాలోచన అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తిత్లీ తుఫాను అతళాకుతలం చేస్తే స్పందించని కేసీఆర్, కేటీఆర్, కవితలు.. జగన్ దాడి విషయంలో వెంటనే సానుభూతి తెలిపారని విమర్శించారు.

కేంద్రం రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని, ఇందుకు తమ అధీనంలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా వినియోగించుకుంటుందని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయశాఖ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా అడిగినందుకు ఇన్ని దాడులు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐ విషయంలో అర్ధరాత్రి కేంద్రం డ్రామా చేసిందన్నారు. భవిష్యత్తులో దేవాలయాల దగ్గర కుట్రలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే తిరుమలను వివాదాస్పదం చేయాలని, బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామితో న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేయించారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేరొన్నారు. తమ ప్రభుత్వంపైకి హిందువులను వ్యతిరేకం చేయాలని ప్రణాళికా బద్దంగా కేంద్రం డ్రామాలు అడిస్తుందని దుయ్యబట్టారు. దీంతో మసీదులు, చర్చిలపైనా దాడులు జరిగే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తితే అణచివేశాం.. భవిష్యత్ లోనూ రాజీపడే ప్రస్తక్తే  లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  Chandrababu  KCR  nara lokesh  Titli  somi reddy  crime  

Other Articles