High court issues notices against TDP MLA టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్..

Set back for tdp mla bonda uma maheswara rao in high court

high court, bonda uma maheswar rao, bonda uma, vijayawada police, ram reddy koteshwara Rao, Andhra Pradesh, Crime

High court issues notices to Vijayawada police to take action against TDP MLA Bonda Uma Maheswara Rao for allegedly land encroachning and creating forgery documents on threatening Ramreddy koteshwara Rao.

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్..

Posted: 10/17/2018 02:47 PM IST
Set back for tdp mla bonda uma maheswara rao in high court

టీడీపీ నేత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టు ఇవాళ ఆయనకు షాకిచ్చింది. ఆయనపై పోలీసులు తక్షణం కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించాలని అదేశాలను కూడా జారీ చేసింది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన భార్య సహా 9 మందిపై తక్షణం చర్యలకు ఉపక్రమించాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం విజయవాడ పోలీసులకు నోటీసులను జారీ చేసింది.

ఎమ్మెల్యే బోండా ఉమ.. తన స్థలానికి సంబంధించి నకిలీ, ఫోర్జరీ పత్రాలు తయారు చేయించారని వాటితో తన భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు విజయవాడ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సతర్వ చర్యలకు పూనుకోవాలని కూడా అదేశాలను జారీ చేసింది.

కాగా తన భూమిని అక్రమంగా అక్రమించడంతో పాటు ఈ భూమికి సంబంధించిన విషయంలో ఎక్కడికి వెళ్లినా.. తానే ఓ మెట్టు ముందుంటానని, అలా కాని పక్షంలో మరో విధంగా జరుగుతుందని తనను బోండా ఉమ బెదిరించారని కూడా రాంరెడ్డి కోటేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని తాను మొదట స్థానిక పోలీసులకు, ఆనక విజయవాడ పోలీసులను కూడా ఆశ్రయించానని ఆయన చెప్పారు.

అయితే పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని బాధితుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కోన్నారు. కోటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు విచారించిన రాష్టోన్నత న్యాయస్థానం. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుతో పాటుగా, ఆయన భార్యను విరీతో పాటు భూమి అక్రమణలో తనను బెదిరింపులకు గురిచేసిన మరో ఎనమిది మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles