Congress Senior leader ramesh babu to join Janasena జనసేనలోకి సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ బాబు..

Congress senior leader ramesh babu to join janasena

pawan kalyan, janasena, amaravati, Krishna district, nadendla manohar, Tenali, Ramesh Babu, chelamala shetty Ramesh babu, janasena office inauguration, vijayawada, amaravati jana sena office, jana sena amaravati office, pawan kalyan press meet, pawan kalyan vizag tour, pawan kalyan srikakulam tour, andhra pradesh, politics

Another senior congress leader Ramesh babu from Krishna district announced that he will join Jana Sena party and resigns his DCC post.

జనసేనలోకి మరో కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ బాబు

Posted: 10/13/2018 01:09 PM IST
Congress senior leader ramesh babu to join janasena

ఆంద్రప్రదేశ్ లో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీకి ఎన్నికలకు సమయం అసన్నం అవుతున్న క్రమంలో నాయకుల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది. వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ఎన్నికల ప్రత్యక్షపోరులోకి దిగనున్న జనసేనలోకి నాయకులు వచ్చి చేరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేనలోకి చేరి 24 గంటలకు కూడా తిరక్కముందే మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఆయన బాటలోనే పయనించేందుకు సిద్దమయ్యారు.

కృష్ణా జిల్లాకు చెందిన  సీనియర్‌ నేత చలమలశెట్టి రమేష్ బాబు.. తర్వలో జనసేనలోకి చేరనున్నారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో వివిధ స్థాయుల్లో సేవలందిస్తూ, ప్రస్తుతం డీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న చలమలశెట్టి రమేష్‌బాబు తాను పార్టీ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జనసేన విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తనతోపాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతామని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  krishna  chalamala shetty Ramesh Babu  andhra pradesh  politics  

Other Articles