BJP Minister Urinates In Public బహిరంగ మూత్ర విసర్జనను సమర్థించుకున్న బీజేపి మంత్రి..

Bjp minister defends urinating in public after his photo goes viral

Shambhu Singh Khatesar, Rajasthan BJP, Ajmer, Rajasthan, Clean India Mission, Narendra Modi, Vasundhara Raje, Swachh Bharat

A Rajasthan politician has landed in an embarrassing controversy after a photo of him urinating near a wall, right next to a BJP campaign poster went viral on social media.

బీజేపీ మంత్రి బహిరంగ మూత్ర విసర్జన.. స్వచ్ఛతకు తూట్లు..

Posted: 10/08/2018 04:32 PM IST
Bjp minister defends urinating in public after his photo goes viral

బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటూ ఓ వైవు ప్రధాని మోదీ పిలుపునిస్తూ.. వందలాది కోట్ల రూపాయలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచార ఫలమో లేక ప్రధాని పిలుపు ఫలితమో కానీ అనేక మంది స్వచ్చత ప్రమాణాలను పాటిస్తున్నారు. అచరిస్తున్నారు. అయితే స్వచ్ఛత విషయంలో తమ పార్టీ ఇచ్చిన పిలుపుకు అనుగూణంగా వ్యవహరించాల్సిన మంత్రివర్యులు మాత్రం అలాకాకుండా.. తన దారి తనదేనని వ్యవహరిస్తూ అటు పార్టీని, ఇటు స్వచ్ఛా భారత్ ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తున్నారు.

ఇంతకీ ఎవరా అమాత్యులు అంటారా.? ఆయన రాజస్థాన్ బీజేపీ నేత, మంత్రి శంభూ సింగ్ ఖేటసర్.. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిందే కాకుండా.. తన చర్యను కూడా సమర్థించుకుని వార్తల్లోకి ఎక్కారు. అయితే ఆయన పబ్లిక్ గా మూత్రవిసర్జన చేస్తున్న తరుణంలో అక్కడే వున్న మరికోందరు బీజేపి కార్యకర్తలే ఆయన ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం.. అది కాస్తా వైరల్ కావడం చకచకా జరిగిపోయింది. దీంతో నెటిజెన్లు ఆయనపై విమర్శలను గుప్పిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్మేర్ లో పర్యటిస్తున్న సందర్భంగా... బీజేపి ఎన్నికల కార్యాలయానికి సమీపంలోని ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు. ఆ గోడపైన బీజేపీ పోస్టర్ కూడా ఉండటం గమనార్హం. తనపై నెటిజెన్లు ట్రోల్ చేస్తుండటంతో... ఎట్టకేలకు ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. బీజేపీ పోస్టర్ వద్ద తాను మూత్ర విసర్జన చేయలేదని... ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని చెప్పారు.

ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ... బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పు కాదని, అయితే అది నిర్మానుష్య ప్రాంతమై ఉండాలని అన్నారు. తాను మూత్ర విసర్జన చేసింది నిర్మానుష్య ప్రాంతంలో అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవని అన్నారు. ఈ వివరణపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతమైతే అక్కడ బీజేపీ పోస్టర్ ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి సొంత పార్టీ నేతలలే చెడ్డ పేరు తెస్తున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shambhu Singh Khatesar  BJP  Ajmer  Rajasthan  Clean India Mission  Swachh Bharat  

Other Articles