Ashish Deshmukh quits BJP, to join Congress రాహుల్ తో భేటీ.. పార్టీకి పదవికి బీజేపి ఎమ్మెల్యే రాజీనామా

Ashish deshmukh shocks bjp to join congress

Vidarbha, Ranjeet Deshmukh, Rahul Gandhi, Congress Working Committee, Ashish Deshmukh congress, Ashish Deshmukh, BJP legislator, BJP representative, eastern Vidarbha, Maharashtra, Politics

BJP MLA Ashish Deshmukh, a staunch proponent of separate Vidarbha state, has announced his resignation as a member of the Maharashtra Legislative Assembly as well as from the primary membership of the party.

రాహుల్ తో భేటీ.. పార్టీకి పదవికి బీజేపి ఎమ్మెల్యే రాజీనామా

Posted: 10/04/2018 05:07 PM IST
Ashish deshmukh shocks bjp to join congress

అవినీతి రహిత భారత్ నిర్మాణమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు.. సోంత పార్టీ ఎమ్మెల్యే దిమ్మదిరిగే షాకిచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ తో పాటు.. అమిత్ షా తనయుడి కంపెనీ వ్యవహారాల విషయంలో జరిగిన అవినీతిపై వారెందుకు సమాధానాలు చెప్పడం లేదని నిలదీసిన ఆయన.. విపక్ష సభ్యుల విషయంలో బీజేపీ తీవ్రమైన తప్పులు చేసిందని.. కానీ సొంత పార్టీ నేతల విషయంలో ఎంతటి అరోపణలపైనైనా మౌనం వహించిందని ఆరోపించారు.

ఇంతకీ ఎవరా నేత అంటారా.. ఆయన మరెవరో కాదు.. మహారాష్ట్ర ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ ముఖ్. అంతటితో ఆగని ఆయన తన పదవికి రాజీనామా కూడా చేసి తీవ్ర కలకలం రేపారు. విదర్భ రీజియన్ లోని కటోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆశిష్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వార్దాలో కలిసి, మాట్లాడి వచ్చిన తరువాత, రాజీనామా చేయనున్నట్టు మీడియాకు వెల్లడించారు. ఆపై అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని పేర్కొన్నారు.

కాగా, నాలుగేళ్ల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ లో ఉన్న దేశ్ ముఖ్, ఆపై బీజేపీలో చేరి కటోల్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన 'మేగ్నటిక్ మహారాష్ట్ర', కేంద్రం ఆర్భాటంగా ప్రారంభించిన 'మేకిన్ ఇండియా'లు క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫలితాలనూ చూపించలేదని.. అలాగే స్వచ్ఛా భారత్ కూడా ప్రచారం కోసమే తప్ప.. నిజానికి క్షేత్రస్థాయిలో మాత్రం కాసింత ప్రభావమైనా చూపడం లేదని విమర్శించారు.

దేశ యువత ఇప్పుడు రాహుల్ గాంధీపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు తన వంతు సాయం చేస్తానని అన్నారు. కాగా, ఆశిష్ దేశ్ ముఖ్ రాజీనామాను ఆమోదించలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉండటం, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు తీసుకురావడం ఇష్టంలేకనే 'మహా' ప్రభుత్వం ఆయన రాజీనామాను పెండింగ్ లో ఉంచాలని భావిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP legislator  Ashish Deshmukh  BJP representative  eastern Vidarbha  Maharashtra  Politics  

Other Articles