gajwal trs leaders gives shock to kcr కేసీఆర్ ఇలాకాలో గులాబీ బాస్ కు షాక్.!

Gajwal trs leaders join congress giving shock to kcr

KCR, Gajwel, TRS, Congress, Vanteru Pratap Reddy, Uttam Kumar Reddy, congress, TRS activists, siddipet district, telangana, politics

Telangana care taker CM's own constituency gajwal trs leaders gives shock the KCR. Some of the leaders join congress party in the presence of TPCC president Uttam Kumar Reddy.

కేసీఆర్ ఇలాకాలో గులాబీ బాస్ కు షాక్.!

Posted: 10/04/2018 02:16 PM IST
Gajwal trs leaders join congress giving shock to kcr

ఎన్నికల వేళ కార్యకర్తలు, నేతలు, పార్టీలు మారడం సర్వసాధరణమైన విషయమే. అయితే ఏకంగా బంగారు తెలంగాణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసిందన్న సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ బాస్ కు షాకిచ్చారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ ఫిరాయింపులు అధికం కాగా, టీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి భంగపడ్డ అనేక మంది నేతలు ఇతర పార్టీ కండువాను కప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో టికెట్ల కోసం సొంత పార్టీలోనే వర్గపోరు మొదలైంది.

రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సైతం గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గజ్వేల్ ను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రైతులకు అండగా నిలబడిన కారణంగా వంటేరు ప్రతాప్ రెడ్డిని కేసీఆర్ సర్కార్ జైలు ఊచలు లెక్కబెట్టించింది. ఈ క్రమంలో కేసీఆర్ కన్నా ప్రతాప్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు వుంది.

ఈ తరుణంలో ప్రతాప్ రెడ్డి ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన రాకను, ఆయన అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ.. పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగదేవ్ పూర్‌ ఎంపీపీ రేణుకతోపాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెట్టింపు ఉత్సాహం తోడైందని, ఈ సారి అధికార టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా భంగపాటు తప్పదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీపీ రేణుకతోపాటు ఎంపీటీసీలు మమతాభాను, కవితా యాదగిరి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్‌, వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ వైపు చూస్తుంటే కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుందన్నారు. కేసీఆర్‌ ఫామ్ హౌస్ (వ్యవసాయక్షేత్రం) గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్‌లో ఉండగా.. ఆ ప్రాంత ఎంపీపీ రేణుక కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Gajwel  TRS  Congress  Vanteru Pratap Reddy  TRS activists  telangana  politics  

Other Articles