Caterpillar found in IKEA's veg biryani ఐకియా రెస్టారెంట్లో.. వెజ్ ధరలోనే నాన్ వెజ్ బిర్యాని

Ikea hyderabad restaurant serves caterpillar in veg biryani

ikea, ikea furniture store, Swedish home furniture giant, Ikea caterpillar biryani, ikea restaurant, ikea hyderabad, IKEA food, IKEA, ikea biryani caterpillar, Ikea Veg Biryani caterpillar

Nearly a month after its inaugural launch in Hyderabad, Swedish home furniture giant IKEA has faced embarrassment after a customer alleged that a caterpillar was found in a food order served to him.

ఐకియా రెస్టారెంట్ స్పెషల్: వెజ్ బిర్యానిలో..

Posted: 09/03/2018 12:02 PM IST
Ikea hyderabad restaurant serves caterpillar in veg biryani

శీర్షిక చూసి అవ్యాకయ్యారా.? వెజ్ బిర్యానిలో... అంటే ఏం వడ్డిస్తున్నారని కంగారు పడుతున్నారా.? లేక వెజ్ ధరలోనే నాన్ వెజ్ బిర్యాని వడ్డిస్తున్నారంటే నమ్మకం కలగడం లేదా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. అయితే అందిరకీ మాత్రం కాదండోయ్. రమారమి నెల రోజుల క్రితం హెటెక్ సిటీ ప్రాంతంలో బయో డైవర్సిటీ పార్కుకు చేరువలో ఏకంగా 13 ఏకరాల స్థలంలో అవిష్కృతమైన స్వీడెన్ కు చెందిన ఫర్నీచర్ దిగ్గజ సంస్థ ఐకియా తన దుకాణాన్ని హైదరాబాద్ లోని కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

గ్రాండ్‌గా ప్రారంభమైన ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో శాఖాహార బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు రూ.11,500 జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం (ఆగస్టు 31) ఐకియా స్టోర్‌కు వెళ్లిన మొహమ్మద్‌ అక్కడి ఫుడ్‌కోర్టులో బిర్యానీ తింటుండగా.. అందులో గొంగళి పురుగు కనిపించింది.

ఈ విషయాన్ని అతడు స్టోర్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ట్విట్టర్‌ ద్వారా సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు శనివారం (సెప్టెంబరు 1) స్టోర్ లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు.

ఐకియాకు బిర్యానీ సరఫరా చేస్తున్న నాగ్ పూర్ కు చెందిన హల్దీరామ్ సంస్థకు కూడా నోటీసులు జారీచేశారు. ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్వహణ లోపాలను సరిచేసుకుంటామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IKEA  Ikea restaraunt  veg biryani  cater pillar  hyderabad  swedish home furniture gaint  

Other Articles