minor gangraped, for not repaying Rs 1,500 loan రూ.1500 తిరిగి చెల్లించలేదని.. మైనర్ పై గ్యాంగ్ రేప్..

17 year old asks for more time to repay rs 1 500 loan is gangraped by 2 men

Rape, Gangrape, Minor girl, POCSO Act, muradnagar police station, loan repay, Ghaziabad Police, Rs 1500 Loan, Uttar pradesh, crime

A day after being arrested, two men — accused of gang raping a 17-year-old girl in Uttar Pradesh’s Muradnagar — were produced before a Ghaziabad court, which remanded them in judicial custody for 14 days.

రూ.1500 తిరిగి చెల్లించలేదని.. మైనర్ పై గ్యాంగ్ రేప్..

Posted: 09/01/2018 02:29 PM IST
17 year old asks for more time to repay rs 1 500 loan is gangraped by 2 men

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. తమ వద్ద తీసుకున్న డబ్బును తిరగిఇవ్వకుండా పదే పదే వాయిదాలు వేస్తుందన్న కోపంతో ఇద్దరు మగమృగాళ్లు దారుణానికి పాల్పడ్డాయి. మైనర్ బాలికను సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన ఇద్దరు యువకులు అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పైశాచిక మృగాలు బాలికపై దారుణానికి పాల్పడుతుండగా, అటు వైపుగా ఎవరు వచ్చినా వారిని అలర్ట్ చేయడానికి ఓ మైనర్ బాలుడు కూడా సహకరించాడు. ఇంతకీ వారి వద్ద నుంచి తీసుకున్న మొత్తం కేవలం రూ. 1500 మాత్రమే.

అయితే అందుకు పలు రెట్లు అధికంగా వడ్డీని అడగమే బాలిక డబ్బు తిరిగివ్వలేకపోవడానికి కారణం. ఉత్తర్ ప్రదేశ్ లోని మురుద్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ ఖర్చుల కోసం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు తీసుకుంది. 11వ తరగతి ఫెయిల్ కావడంతో చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో, అప్పు తీర్చాలంటా బాధితురాలిపై జాహిద్, మోహన్ లు ఒత్తిడి తీసుకొచ్చారు. తనకు కొంచెం సమయం కావాలని ఆమె అడిగింది.

ఈ క్రమంలో ఆమె సైకిల్ పై వస్తుండగా జాహిద్, మోహన్ లతో పాటు మరో మైనర్ బాలుడు ఆమెను అడ్డుకున్నారు. అప్పు చెల్లించాలని అడగ్గా, డబ్బు లేదని ఆమె తెలిపింది. దీంతో, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి, అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో... వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, విరితో పాటు మరో మైనర్ బాలుడిని కూడ అదుపులోకి తీసుకున్నామని, అతడ్ని కూడా జువైనల్ హోంకు తరలించనున్నామని చెప్పారు. మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడకపోయినప్పటికీ, నేరానికి సాయపడ్డాడని తెలిపారు. అందువల్ల అతన్ని జువైనల్ హోమ్ కు తరలించామని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Gangrape  Minor girl  POCSO Act  Ghaziabad Police  Rs 1500 Loan  Uttar pradesh  crime  

Other Articles