బీహార్‌లోని ఎన్డీయే మిత్రపక్షాలు మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చిందనుకుంటున్న తరుణంలో.. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మళ్లీ ప్లేటు తిరగేసింది. సీట్ల పంపకంపై రాజీపడే ప్రసక్తే లేదనీ.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెగేసి చెప్పింది. కాగా బీహార్‌లోని అన్ని స్థానాల్లోనూ ఎన్డీయే విజయం తథ్యమనీ... సీట్ల పంపకంపై ఇప్పటికే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరిందని బీజేపీ వర్గాలు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా ఫార్ముల ప్రకారం బీహార్‌లోని మొత్తం 40 స్థానాలకు గానూ ప్రధాన పక్షం బీజేపీకి 20 స్థానాలు కేటాయించగా.. జేడీయూకి కేవలం 12 సీట్లు ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగింది. పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీకి 2014లో మాదిరిగానే 6 సీట్లు, కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీకి రెండు సీట్లు కేటాయించినట్టు సమాచారం. అయితే సీట్ల పంపకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి చెబుతున్నారు. ‘‘ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే సీట్ల లెక్కలు బయటికి ఎలా వచ్చాయి. అదీగాక, ఆ లెక్కలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని స్పష్టం చేశారు.
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలం కావడం, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో... సీట్ల వాటాపై స్వరం పెంచేందుకు జేడీయూకి అవకాశం దొరికింది. జూలైలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడీయూ నేత త్యాగి మాట్లాడుతూ... ‘‘సార్వత్రిక ఎన్నికలకు గానూ బీహార్‌లో జేడీయూకి అధికస్థానాలు కేటాయించాల్సిందే...’’ అని డిమాండ్ చేశారు.
ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెబుతున్న దాని ప్రకారం... మొత్తం 40 సీట్లలో బీజేపీకీ, జేడీయూకి సమానంగా 16 సీట్ల చొప్పున కేటాయించాలనీ... మిగతా ఎనిమిది స్థానాలు ఎన్డీయే పాత, కొత్త మిత్రపక్షాలుకు ఇవ్వాలని జేడీయూ ప్రతిపాదిస్తోంది. అంటే ఆరు పాశ్వాన్ పార్టీకి, ఒకటి ఆర్జేడీ మాజీ నేత పప్పూ యాదవ్‌కి, కుశ్వాహ పార్టీలోని అసమ్మతి నేతకు ఓ స్థానాన్ని కేటాయించాలని జేడీయూ చెబుతోంది. అయితే జేడీయూ సీట్ల పంపిణీ ఫార్ములాలో ఉపేంద్ర కుశ్వాహ పార్టీకి స్థానం లేకపోవడం గమనార్హం.
2014 ఎన్నికల్లో ఎన్డీయేలో కలిసి పోటీచేసిన ఆర్ఎల్ఎస్పీ 3 స్థానాల్లో విజయం సాధించింది. అయితే నరేంద్రమోదీని అభ్యర్థిగా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లో ఒంటరిగా బరిలోకి దిగిన జేడీయూకి కేవలం రెండు స్థానాల్లోనే విజయం దక్కింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 22 స్థానాల్లో విజయభేరి మోగించింది. లాలూ సారథ్యంలోని ఆర్జేడీ ఆరు, కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే 2014కి ముందు ఎన్డీయే మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు తాము 25 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేసిందనీ.. అదే ఫార్ములా ఇప్పుడు కూడా పాటించాలన్నది జేడీయూ వాదన.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more