Law Commission Calls For Reform Of Family Laws First ఏకరీతి సౌరస్మృతి అవసరం, అవశ్యకత లేదు: లా కమీషన్

Law commission gives thumbs down to uniform civil code

Law Commission, Uniform Civil Code, Family Laws, Triple Talaq, child marrages, social evils

The Law Commission of India has said that a uniform civil code is "neither necessary nor desirable" at this stage. Instead has suggested changes in laws relating to marriage, divorce, alimony, and marriageable age.

ఏకరీతి సౌరస్మృతి అవసరం, అవశ్యకత లేదు: లా కమీషన్

Posted: 09/01/2018 11:59 AM IST
Law commission gives thumbs down to uniform civil code

దేశంలోని మైనారిటీలందరకీ ఏకరీతిన పౌరస్మృతి కావాలన్న అంశాన్ని భారతీయ న్యాయ కమీషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకరీతి సౌరస్మృతి అవసరం కానీ అవశ్యకత కానీ ప్రస్తుతం చర్చనీయాంశమే కాదని.. దీని కన్నా ముందుగా కుటుంబ చట్టాలలో సంస్కరణల అవసరం వుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పెళ్లి, విడాకులు, భరణం సహా స్త్రీ, పురుషుల వివాహాల వయస్సులపై సంస్కరణలు తీసుకురావాలని సూచించింది.

రిటైర్డు జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత న్యాయ కమీషన్ ఈ ప్రజాస్వామ్య, లౌకికవాద దేశంలో మేజర్లైన వారు తమ మతాన్ని తామే ఎంచుకునే విధానాన్ని కూడా బలంగా రక్షించాల్సిన అవసరముందని అన్నారు. అదే సమయంలో సమాజానికి రుగ్మతలుగా మారిని త్రిపుల్ తలాక్, బాల్య వివాహాల వంటి సాంఘిక దురాచారాలను ఎలాంటి పరిస్థితుల్లో సహించరాదని ఇందుకు మతాచారాలను అడ్డుగా పెట్టుకోవడం కూడా సముచితం కాదని పేర్కోంది. సాంఘిక దురాచారాలకు మతాలను అడ్డుగా పెట్టుకోవడం సమాధిమూర్ఖత్వమని పేర్కొంది.

పురుషుల కనీస వివాహ అర్హత వయసు తగ్గే అవకాశం వుంది. ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని పేర్కొంది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం.. ఓ వ్యక్తి మెజారిటీ వయసు 18 ఏళ్లని, స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. లాకమిషన్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీపురుష సమానత్వం మాట ఎలా ఉన్నా, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టు అవుతుందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Law Commission  Uniform Civil Code  Family Laws  Triple Talaq  child marrages  social evils  

Other Articles