Amit shah clariffies on early polls and alliance with TRS ముందస్తు ఎన్నికలు.. పొత్తుపై అమిత్ షా క్లారిటీ..

Amit shah clariffies on early polls and alliance with trs

telangana goverment, Early polls, Allaince, TRS, BJP, Amit Shah, KCR, Bandaru dattatreya, Lakshman, speculations, politics, Telangana

BJP President Amit Shah clarrified on the ongoing speculations of his party having alliance with TRS in the forth comming elections in Telanagana. Shah not ruled out on the Early polls hinted BJP leaders not to underestimate them. He also said BJP is not having any association with TRS.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. పొత్తుపై బీజేపి క్లారిటీ..

Posted: 09/01/2018 11:07 AM IST
Amit shah clariffies on early polls and alliance with trs

జమిలి ఎన్నికలకు తెరతీసిన కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ.. అది సాధ్యం కాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వివరణతో ఇక ముందస్తు ఎన్నికల వైపు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటుగా అన్యోన్యత కొనసాగిస్తున్న తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుంది. అటు కేంద్రంలోని బీజేపి, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ రెండు ముందస్తుకు వెళ్తున్నా.. రెండు పార్టీల మధ్య మైత్రి కూడా కొనసాగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికలలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాయని వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే ఈ వార్తలపై బీజేపి జాతాయ అధ్యక్షుడు అమిత్ షా క్లారిటీ ఇచ్చారు., ఓ వైపు తెలంగాణలోనూ తమ సత్తాను చాటుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపి వీలైతే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, మోదీ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడం, ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలోకి ఆకర్షించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ ముఖ్యనేతలో సమావేశమైన ఆయన టీఆర్ఎస్‌తో పొత్తుపై పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై ఛార్జిషీటు జారీ చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. కేంద్రం ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెబుతున్నట్టు వంద సీట్లు రావడం అసాధ్యమని పేర్కొన్న అమిత్ షా... ప్రచారానికి తాను కూడా వస్తానని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Early polls  Allaince  TRS  BJP  Amit Shah  KCR  politics  Telangana  

Other Articles