water bootle is the reason behind Harikrishna demise హరికృష్ణ మరణానికి అదే కారణమా.?

Nandamuri harikrishna demise how water bootle is the reason behind accident

nandamuri harikrishna, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, nandamuri harikrishna water bottle, water bottle, andhra pradesh, Telanagana, kamineni hospital, Road accident, crime

Following news of the death of actor-politician Nandamuri Harikrishna his friends who travelled with him in the car says, Water bottle is the main reason behind the accident,

హరికృష్ణ మృతికి కారణం అదేనా.?

Posted: 08/29/2018 01:45 PM IST
Nandamuri harikrishna demise how water bootle is the reason behind accident

నెల్లూరు జిల్లా కావలిలో తన మిత్రుడు మోహన్ కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం మరో ఇద్దరు మిత్రులతో కలసి వెళ్తున్న నందమూరి హరికృష్ణ కారుకు నార్కెట్ పల్లికి చేరువలోని అన్నేపర్తి గ్రామశివార్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం కారు ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి కుడివైపుకు దూసుకెళ్లిందని దీంతో సీటుబెల్టు పెట్టుకోని కారణం చేత ఆయన కారులోంచి ఎగిరి పడ్డారని, ఫలితంగా తలకు బలమైన గాయాలు తగిలాయని చెబుతున్నారు. హరికృష్ణ స్వయంగా కారు నడిస్తున్న క్రమంలో అలా ఎలా ప్రమాదం జరిగిందంటే.. కారులో వున్న మిత్రులు చెబుతున్న కథనం ఇలా వుంది.

హరికృష్ణ హైదరాబాద్ ఇంటి నుంచి పొద్దున 4.30కి నెల్లూరు కావలికి బయలు దేరారు. కారులో మరో ఇద్దరు మిత్రులతో కలసి బయలుదేరి వెళ్లారు. ఉదయం 5.45కి నల్లగొండ జిల్లా అన్నెపర్తి పెట్రోల్ బంక్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడే కారు ప్రమాదం జరిగింది. కారును హరికృష్ణే స్వయంగా నడుపుతున్నారు. గంటకు 120 కి.మీ. వేగంతో కారు వెళ్తున్న సమయంలో… మంచినీళ్ల కోసం వెనక్కి తిరిగి చూశారు హరికృష్ణ. రెప్పపాటులోనే డివైడర్ ను కారు ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ ఎగిరి.. అవతలి రోడ్డుపై ఎదురుగా.. హైదరాబాద్ కు వస్తున్న మరో కారును ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో కార్ డోర్ ఓపెన్ అవడంతో… హరికృష్ణ బయటకు ఎగరిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లినా.. వైద్యులు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయారు. కారులో ఉన్న ఇద్దరు గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న కారులోని మరో వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు విరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్‌ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ ఆకస్మిక మరణవార్త  విని ఆయన మిత్రుడు మోహన్‌ దిగ్ర్భాంతికి లోనయ్యారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని వార్త విన్న మోహన్‌, అతని కుటుంబ సభ్యులు  కన్నీళ్లు పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  Road accident  Jr  NTR  Kalyan Ram  Janaki Ram  water bottle  crime  

Other Articles