Political celebs mourn for demise of Harikrishna హరికృష్ణ మృతిపై రాజకీయ ప్రముఖుల దిగ్ర్భాంతి

Political leaders mourn for the demise of nandamuri harikrishna

nandamuri harikrishna, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, Jr, NTR, Kalyan Ram, Janaki Ram, chandrababu, KCR, YS jagan, Venkaiah Naidu, Jana sena, Pawan Kalyan, andhra pradesh, Telanagana, kamineni hospital, Road accident, crime

Following news of the death of actor-politician Nandamuri Harikrishna, Political Leaders of Telugu state mourn for his demise, including chief ministers, opposition leaders, along with vice-president.

హరికృష్ణ మృతిపై రాజకీయ ప్రముఖుల దిగ్ర్భాంతి

Posted: 08/29/2018 12:39 PM IST
Political leaders mourn for the demise of nandamuri harikrishna

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా కామినేని అసుపత్రికి చేరుకున్నారు. కామినేని అసుపత్రిలో అడుగుపెడుతూనే తన కంటనీరును అపుకోలేకపోయారు.

అనంతరం హరికృష్ణ మృతిపై ఆయన తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన కుటుంబానికి తీరని లోటని ఆయన అవేదన వ్యక్తం చేశారు.కారు ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అమరావతి నుంచి… ఆయన హెలికాప్టర్ లో కామినేని హాస్పిటల్ కు బయల్దేరివెల్లారు. అత్యున్నత వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. దురదృష్టవశాత్తూ ఆయనను కాపాడుకోలేకేపోయామని చంద్రబాబు చెప్పారు.

చైతన్య రథసారథిగా… మహానుభావుడు ఎన్టీఆర్ ను జనంలోకి తీసుకెళ్లి.. అన్నగారిని ప్రజలకు చేరువ చేసింది హరికృష్ణేనని చంద్రబాబు అన్నారు. మామ ఎన్టీఆర్ కు పార్టీలోనూ.. కుటుంబంలోనూ అత్యంత ఇష్టమైనవ్యక్తి హరికృష్ణే అన్నారు. తనతో ఎంతో స్నేహంగా మెలిగేవారని చెప్పారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకే కాదు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆయన మరణం తీరని లోటు అన్నారు. సాంఘిక, పౌరాణిక సినిమాల్లో నటించి హరికృష్ణ తనదైన ముద్రవేశారని చెప్పారు చంద్రబాబు.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

నందమూరి హరికృష్ణ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణ మృతి పట్ల మంత్రులు హరిశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

షాక్ కు గురయ్యా: జగన్  

నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైయస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బుధవారం ఉదయం నల్గొండ జిల్లా అన్నేవర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

అకాల మరణం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరం: పవన్ కళ్యాణ్
నందమూరి హరికృష్ణ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. జనసేన తరపున ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో ‘నల్గొండ జిల్లాలో హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని.. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.

తన తరపున, జనసేన పార్టీ తరపున హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ఆయన అకాల మరణానికి సంతాపంగా బుధవారం జరగాల్సిన జనసేన పార్టీ కార్యక్రమాలు రద్దు చేసినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  Road accident  Jr  NTR  Kalyan Ram  Janaki Ram  chandrababu  KCR  andhra pradesh  

Other Articles