Nandamuri Harikrishna killed in accident రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణం

Nt rama rao s son harikrishna killed in accident

nandamuri harikrishna, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, nandamuri harikrishna Road accidents, nandamuri harikrishna family, nandamuri harikrishna narketpally, tdp, chandrababu naidu, nandamuri harikrishna accident, Jr, NTR, Kalyan Ram, Janaki Ram, Crime

Nandamuri Harikrishna, TDP leader and son of former Andhra Pradesh chief minister N T Rama Rao, passed away in a car accident on Wednesday.

ITEMVIDEOS: రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణం

Posted: 08/29/2018 11:14 AM IST
Nt rama rao s son harikrishna killed in accident

అదే నల్గోండ జిల్లా.. అదే నార్కెట్ పల్లి ప్రాంతం.. అదే రోడ్డు ప్రమాదం మరో టీడీపీ నేతను బలితీసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సినీనటుడు  నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. ఇవాళ తెల్లవారు జామున నల్గోండ జిల్లా అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్లా పడటంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యారు. వెంటనే నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు.

నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్‌ రహీమ్‌’, ‘దాన వీర శూర కర్ణ’ తదితర చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్న ఆయన తిరిగి ‘శ్రీరాములయ్య’తో 1998లో మరోసారి వెండితెరపైకి వచ్చారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, ‘సీతయ్య’, ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’, ‘స్వామి’, ‘శ్రావణమాసం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాల తర్వాత ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  Road accident  Jr  NTR  Kalyan Ram  Janaki Ram  Crime  telangana  crime  

Other Articles