cheating case against Hrithik Roshan in Chennai బాలీవుడ్ నటుడిపై చీటింగ్ కేసు..

Chennai police files a cheating case against hrithik roshan

Hrithik Roshan, cheating case, stockist, Kodungaiyur police, Legal, Case, FIR, Indian Penal Code, duping case, Bollywood, Crime

A case has been filed against Bollywood actor Hrithik Roshan and eight others for allegedly duping a Chennai-based stockist of Rs 21 lakh.

బాలీవుడ్ నటుడిపై చీటింగ్ కేసు..

Posted: 08/28/2018 05:56 PM IST
Chennai police files a cheating case against hrithik roshan

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ ప్రముఖ సంస్థతో పాటుగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనను మోసం చేశారని అరోపించారు. తనను మోసం చేశారంటూ చెన్నైకు చెందిన స్టాకిస్ట్ (రిటైలర్) మురళీధరణ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హృతిక్‌ తో పాటు మరో 8 మంది రూ.21 లక్షలు చీట్‌ చేశారంటూ మురళీధరణ్ కొడుంగైయూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని తనకు తగున్యాయం చేయాలని పోలీసులను కోరారు.

‘హెచ్‌ఆర్‌ఎక్స్’ బ్రాండ్‌‌కు హృతిక్‌ తనను స్టాకిస్ట్‌గా నియమించుకున్నారని, ఆ తర్వాత తనను మోసం చేశారని మురళీ ఆరోపించారు. మురళీధరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు హృతిక్‌‌తో పాటు మిగిలిన 8 మందిపై మంగళవారం (ఆగస్టు 28) కేసు నమోదు చేశారు. హృతిక్‌ నాలుగేళ్ల కిందట హెచ్‌ఆర్‌ఎక్స్‌ బ్రాండ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు నగరాల్లో దీనికి సంబంధించిన శాఖలు ఏర్పాటు చేశారు.

హృతిక్‌ ప్రస్తుతం‌ వికాశ్‌ బెహల్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పేద విద్యార్థులకు ఐఐటీ కలను సాకారం చేస్తున్న ఆనంద్ కుమార్ (బిహార్‌) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘సూపర్‌ 30’ అనే టైటిల్ ఖాయం చేశఆరు. ఇందులో హృతిక్‌.. ఆనంద్‌ కుమార్‌ పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ‘సూపర్ 30’ సంస్థకు సంబంధించి అసంబద్ధ అంశాలను తెరకెక్కిస్తున్నారంటూ ఆనంద్ కుమార్ ఆరోపిస్తుండటంతో ఈ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hrithik Roshan  cheating case  stockist  Kodungaiyur police  Legal  Case  FIR  Indian Penal Code  duping case  Bollywood  Crime  

Other Articles