ఆ ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి బాగా పదునుపెట్టాడు. ఇప్పటికే పెళ్లి ఫోటోలు తీయడంతో నిష్ణాతుడిగా గుర్తింపుపొందిన ఈయన.. తొండ ముదిరి ఊసరవెళ్లి అయ్యిందన్నట్లు.. తన క్రీయేటివిటీకి పదను పెడుతూ పెడుతూ.. కొత్త సృజనాత్మకత తీసిన ఫోటో ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎంతలా అంటే నిన్ను చంపేస్తాం.. మా సంప్రదాయాలకు భంగం కలిగేలా.. ఫోటోలు తీస్తావా.? అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అగంతకులు.
ఇంతకీ ఈ ఫోటోగ్రాఫర్ చేసిన తప్పేంటీ.. అంటే ఓ మోడల్‌కు పెద్ద బొట్టు పెట్టి బెంగాళీ పెళ్లి కూతురులా ముస్తాబు చేశాడు. అయితే, ఆమె శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటో తీసి.. తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ గా మారడంతో బెంగాళీలు ఆ ఫొటోగ్రాఫర్‌పై మండిపడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోల్ కతాకు చెందిన ప్రీతమ్ మిత్రాకు వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ గా మంచి పేరుంది. మరింత పాపులారిటీ కోసం సరికొత్తగా ఫొటోషూట్ చేద్దామని భావించాడు.
ఇందులో భాగంగా మోడల్ తో ‘న్యూడ్ ఫొటో’ తీశాడు. ఆ నగ్న చిత్రంలో మోడల్ ముఖం, వక్షోజాలు కనిపించకుండా తమల పాకులు, జుట్టుతో కవర్ చేయడంతో పాటు చేత్తో మర్మాంగాన్ని కూడా కవర్ చేయించాడు. అయితే, బెంగాళీ నెటిజన్లు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బెంగాలీ వివాహ వ్యవస్థ, హిందువులను అవమానించేలా ఆ ఫొటో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు.. 24 గంటల్లో ఫొటో తొలగించకపోతే చంపేస్తామని పీత్రమ్ను హెచ్చరించారు. దీనిపై ప్రీతమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫొటో వల్ల ప్రీతమ్ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more