Rupee slips below 70 mark 15 ఏళ్ల కనిష్టస్థాయికి రూపాయి మారకం విలువ..

Rupee leaps from life low to snap weeks of decline despite global headwinds

Rupee low, turkey, dollar, Rupee, Federal Reserve System, Brexit, Brent crude, India Business News

The rupee staged a spirited recovery from its life-time low to end higher by a whopping 24 paise at 69.91 against the US currency in a highly volatile week on bouts of dollar selling by exporters and corporates.

15 ఏళ్ల కనిష్టస్థాయికి రూపాయి విలువ.. గొప్పలే మిగిలాయి..

Posted: 08/25/2018 04:53 PM IST
Rupee leaps from life low to snap weeks of decline despite global headwinds

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ క్షీణతపై గతంలో ఎన్నో ప్రసంగాలు చేసి దానిని కూడా ఎన్నికల ప్రచారాంశంగా చేసిన అధికార నేతలకు.. ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడం.. అందులోనూ ఏకంగా పదిహేనేళ్ల కనిష్టస్థాయికి దిగజారడంతో తాము ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియకుండా పోతుంది. దేశ ఆర్థికాభివృద్ధికి కరెన్సీ మారకం విలువ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే.  

ఇప్పటికే రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంతో పలు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన విషయం కూడా తెలిసిందే.. డాలరు మారకం విలువ 70 రూపాయలు దాటడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. బ్రిటిష్‌ పాలన నుంచి 1947లో భారత్‌ విముక్తి పొందేటప్పటికి రూపాయి విలువ డాలరుతో సమానంగా ఉండేది. అంటే ఒక రూపాయికి ఒక డాలరు అన్న మాట… పాలకుల అస్తవ్యస్త విధానాల వల్లే డాలరు విలువ పెరుగుతుందంటున్నారు కొంతమంది ఆర్ధిక నిపుణులు.

గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎగుమతులను పెంచేందుకు రూపాయి మారకం విలువను రూ.4.75నుంచి రూ.7.5లకు అంటే 57.89 శాతం తగ్గించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం విదేశ మారక నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రూపాయి మారకం విలువను బాగా తగ్గించింది.గత 15 ఏళ్ల నుంచి రూపాయి విలువ పడిపోతూనే ఉంది. 2004-05లో డాలరు మారకం విలువ 44.95 రూపాయలు ఉంది.

2005-06లో 44.28, 2006-07లో 45.25, 2007-2008లో 40.28, 2008-09లో 46.46, 2009-10లో  47.74, 2010-11లో 45.90, 2011-12లో 48.53, 2012-13లో 54.44, 2013-14లో 60.42, 2014-15లో 61.17, 2015-16లో 65.49, 2016-17లో 67.15, 2017-18లో 64.54, 2018-19లో 70.11 ఉంది. పదేళ్ల యూపీఏ హయాంలో రూపాయి పతనం రూ.44.28నుంచి రూ.60.42కు చేరితే, ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో అది రూ.60.42నుంచి 70రూపాయలకు దిగజారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rupee low  turkey  dollar  Rupee  Federal Reserve System  Brexit  Brent crude  India Business News  

Other Articles