Mahesh Supports Kavitha's Big Initiative ఎంపీ కవిత ‘సిస్టర్4ఛేంజ్’కు మహేష్ బాబు సపోర్ట్..

Mahesh babu urges sisters for noble cause

mp kavitha, sister4change, kavitha #sister4change, raksha bandhan, mahesh babu, mahesh babu twitter, #giftAhelmet, మహేష్ బాబు, ఎంపీ కవిత, సిస్టర్4ఛేంజ్, గిప్ట్ ఏ హెల్మెట్

Superstar Mahesh Babu is now supporting #Sisters4Change, a road rules awareness campaign initiated by TRS MP Kalvakuntla Kavitha. As per the initiative, sisters are urged to gift a helmet to their brothers this Raksha Bandhan.

ఎంపీ కవిత ‘సిస్టర్4ఛేంజ్’కు మహేష్ బాబు సపోర్ట్..

Posted: 08/10/2018 11:26 AM IST
Mahesh babu urges sisters for noble cause

అన్నా చెలెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది రాఖీ పౌర్ణమి. ఈ రోజునే అన్నాదమ్ములతో కలసి అక్కాచెలెల్లు సంతోషంగా గడుపుతారు. అయితే రాఖీ ఫౌర్ణమి రోజున అన్నాదమ్ముల ముఖాలలో వెల్లివిరిసే అనందం, సంతోషం వారి జీవితాలలో శాశ్వతంగా వుండాలన్న సంకల్పంతో కొత్త విధానానికి నాంది పలుకుతున్నారు దేశంలోని కొందరు అక్కా చెలెల్లు. అయితే తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయ కవిత మాత్రం గత ఏడాది చెప్పిన విషయాన్నే మరోమారు తన అభిమానులకు, కార్యకర్తలకు, తెలంగాణ అడపడుచులకు గుర్తుచేస్తుంది.

అదేంటంటే రక్షాబంధన్ రోజున అన్నాదమ్ములకు రాఖీ కట్టడంతో పాటు ఓ హెల్మెట్ ను కానుకగా ఇవ్వాలంటూ ‘సిస్టర్4ఛేంజ్’ క్యాంపెయిన్ మొదలెట్టింది. గత ఏడాది తన సోదరుడు కేటీఆర్ కు హెల్మెట్ ను కానుకగా ఇచ్చిన కవిత. ఈ సారి అదే అంశాన్ని క్యాంపెయిన్ గా చేపట్టింది. ‘గిఫ్ట్ ఎ హెల్మెట్’ పేరుతో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.

అయితే ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్న క్రమంలో కవిత ప్రచారానికి.. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, ‘సిస్టర్4ఛేంజ్’ క్యాంపెయిన్ కు మద్దతు పలికారు. ఈ ప్రచారానికి తాను కూడా మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో ఈ ప్రచారాన్ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది చనిపోతున్నారంటూ చెప్పిన ప్రిన్స్, రక్షాబంధన్ రోజు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలంటూ అడపడచులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ క్యాంపెయిన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles