Kanwariya arrested for vandalising car in Moti Nagar సన్యాసికి కోసం వస్తే.. కాకి కథే.. కానీ..

Day after meerut top cop showers kanwariyas with petals pilgrims vandalise vehicle in muzaffarnagar

kanwaria, kanwaria attack, kanwaria police car, kanwaria police vehicle, kanwaria vandalise, kanwariya car turn, kanwaria attack bulandshahr, Delhi, Muzaffarnagar, Yogi Adityanath, Kanwar Yatra, Meerut, Rahul, Uttam Nagar, Uttar Pradesh

Meerut’s top cop showering the Kanwariyas with petals from a helicopter Day after pilgrims vandalise vehicle in delhi moti nagar has raised questions, netizens questioning the authorities of inaction and asking how religion has become a garb to protect the hooligans.

సాధువులపై పూలవర్షం.. పోలీసు అధికారిపై చర్యలపై జనాగ్రహం..

Posted: 08/10/2018 01:10 PM IST
Day after meerut top cop showers kanwariyas with petals pilgrims vandalise vehicle in muzaffarnagar

సన్యాసులు. సాధువులు అరిషడ్ వర్గాలను నియంత్రణ వుంచుకుంటారని తెలిసిందే. కానీ చిన్న విషయంలో రేగిన గొడవలో కారును పూర్తిగా ధ్వంసం చేసి.. తమ ప్రకోపాన్ని చల్లార్చుకున్నారు సాధువులు. నిజమా అంటే ఇది నిజమే.. ఢిల్లీ మోతీనగర్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ కారుకు అడ్డంగా వున్న సాధువును పక్కకు జరగమని గట్టిగా చెప్పింది ఆ కారు నడుపుతున్న యువతి. దీంతో కోపాద్రిక్తుడైన భిక్షువు కారులోని యువతి పక్కనున్న యువకుడి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అగ్రహానికి గురైన యువతి సాధువును చెంపపై కొట్టింది. తన ఐ10 కారుకు అడ్డంగా వచ్చిందే కాకుండా.. పక్కకు జరగమన్నందుకు ఏకంగా తన వారి కాలర్ ను పట్టుకుంటారా.? అంటూ ప్రశ్నించింది.

దీంతో అగ్రహావేశానికి లోనైన సాధువు తన వారికి విషయాన్ని చెప్పి.. కారుపై దాడి చేశాడు. దీంతో పరిస్థితిని గమనించిన కారులోని యువతీ యువకులు స్వల్ప గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేస్తున్నది సాధువులని చూసి వారిని నియంత్రించలేకపోయారు. పోలీసుల ఎదురుగానే సాధువులు కారును నుజ్జు నుజ్జు చేశారు. ఈ దృశ్యాలన్ని అక్కడ ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తం కావడం.. అవి బయటకు రావడం.. సోషల్ మీడియాలోకి చేరడం.. అవి విపరీతంగా వైరల్ కావడం అన్ని చకచక జరిగిపోయాయి.  

ఘటన జరిగిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు కారు ధ్వంసానికి పాల్పడిన సాధువులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో తమను అన్వేషిస్తున్నారన్న సమాచారం అందుకున్న సాధువులు ఏకంగా పోలీసుల వాహనంపై దాడి చేశారు. సుమారుగా 50 మంది సాధువుల గుంపు ఈ దాడిలో పాల్పడిందని సమాచారం. కాగా, ఈ సంఘటనలో కారుపై దాడి చేసిన భిక్షువును పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ బోస్ అలియాస్ బిల్లా అనే సాధువును అదుపులోకి తీసుకున్నారు. మీరట్ ప్రాంతానికి చెందిన రాహుల్ నిరక్ష్యరాసుడే కాక నిరుద్యోగి కూడా. అంతేకాదు గతంలో పలు చోరీలు, ఇంటికి కన్నాలు వేసిన కేసులు కూడా ఇతనిపై నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇక అదే మీరట్ కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి సాధువులపై తన ప్రేమను కనబర్చడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంతి. ఏకంగా ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్న ఆయన.. శివభక్తులైన కన్వారియాల యాత్రం మీరట్ కు చేరుకోగానే వారికి స్వాగతం పలుకుతూ హెలికాప్టర్ నుంచి పూలను చల్లి తమ ప్రేమను చాటుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం కన్వారియాలు సృష్టించిన బీభత్సం నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి చేసిన చర్యలపై నెట్ జనులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇక మరికోందరైతే.. ఉన్నత స్థానంలో కొనసాగుతూ.. ఇలా ప్రేమను కనబర్చడాన్ని తప్పబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Muzaffarnagar  Yogi Adityanath  Kanwar Yatra  Meerut  Rahul  Uttam Nagar  Uttar Pradesh  

Other Articles