Pakistan polls; 35 killed in suicide blast అక్కడంతే.. ఎన్నికలంటే బాంబులు.. రుధిరధారలు..

Pakistan goes to polls 35 killed in suicide blast election related violence

Awami National Party, Balochistan, bomb blast, poll related violence, 30 killed, Balochistan Awami Party, Bilawal Bhutto Zardari, Corruption, Election News, Imran Khan, Islamabad, Judiciary, Khyber Pakhtunkhwa, National Assembly, Nawaz Sharif, Pakistan, Pakistan Army, Pakistan election, pakistan election 2018, Pakistan general election 2018, Pakistan polls, PML-N,PPP, Provincial Assembly, Shehbaz Sharif, crime

Pakistanis voted in a tense election to choose a new government as at least 35 people were killed in an ISIS suicide attack and poll-related violence,

అక్కడంతే.. ఎన్నికలంటే బాంబులు.. రుధిరధారలు..

Posted: 07/25/2018 05:51 PM IST
Pakistan goes to polls 35 killed in suicide blast election related violence

అవినీతి అభియోగాలు, న్యాయస్థానం శిక్షలతో పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ బహిష్కృతుడు కావడంతో వచ్చిన ఎన్నికలలో కూడా హింస రాజ్యమేలింది. ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి చదురుమదరు ఘటనల మినహా అన్ని ప్రశాంతంగా సాగుతున్న క్రమంలో ఆత్మహుతి బాంబుదాడి ఒక్కసారిగా కలకలం రేపింది. ఎన్నికల పోలింగ్ ను హింసాత్మకంగా మార్చింది. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో పాక్ నేతలు తమ వక్రబుద్ధిని చూపించారు.

క్వెట్టాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు పోలీసులు. గాయపడినవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. పోలింగ్ బూత్ బయట ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌ లో సమీపంలో పేలని గ్రనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాకిస్థాన్ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. రక్తపుటేరులు పారాయి. పోలింగ్ బూత్‌ ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ ను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపుచేసే పనిలో ఉన్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan polls  Imran Khan  Nawaz sharif  bomb blast  poll related violence  30 killed  crime  

Other Articles