AP Bandh: Roja, Ambati Rambabu Arrested హోదా కోసం బంద్ పిలుపు: వైసీపీ నేతల అరెస్టులు..

Ap bandh ysrcp leaders roja ambati botsa bhumana detained

AP Bandh, YS Jagan, YSRCP leaders, AP Police, Roja, Ambati Rambabu, Botsa satyanarayan, Bhumana Karunakar Reddy, MLA roja arrested, YSRCP AP bandh, PM Modi, Chandrababu Naidu, andhra pradesh bandh today, APSCS, AP Politics, Andhra Pradesh, Politics

The Andhra Pradesh bandh call given by Opposition party YSR congress demanding Special Category Status to Andhra Pradesh, received an good response across the state, but the police has detained its MLAs and Leaders including Roja, Ambati Rambabu, Botsa satyanarayan, Bhumana Karunakar Reddy.

హోదా కోసం బంద్ పిలుపు: వైసీపీ నేతల అరెస్టులు..

Posted: 07/24/2018 12:30 PM IST
Ap bandh ysrcp leaders roja ambati botsa bhumana detained

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతొంది. హోదా విషయంలో రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం పార్లమెంటులో వీగిపోయిన నేపథ్యంలో బంధ్ తో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. హోదాను డిమాండ్ చేయాలన్న వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

రాష్ట్రంలోని పలు వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర బంద్ కు మద్దతు లభించడంతో బంద్ ప్రశాంతగా కొనసాగుతుంది. అయితే బంద్ ను విజయవంతం చేయడంతో పాటు బంద్ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నించిన విపక్ష నేతలను, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని ర్యాలీకి యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రానికి హోదాను డిమాండ్ చేస్తున్న తమను అరెస్టు చేయడం కేంద్రంలోని అధికార పార్టీతో రాష్ట్రంలోని అధికార పార్టీ లాలూచీని ప్రజల ముందు బహిర్గతం చేస్తుందని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హోదాపై తమ పార్టీ బంద్ పిలుపునిచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ ను అమలుపర్చడం ఏంటని అమె ప్రశ్నించారు. చంద్రబాబు అదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం నీచమైన చర్య అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేకహాదా రావాలని అధికార పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని అన్నారు. ఇక నెల్లూరులో ఎమ్మెల్యే నారాయణస్వామిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వైసీపీ నేతలను అంబటి రాంబాబు. బొత్సా సత్యానారాయణ, భూమన కరుణాకర్ రెడ్డీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Bandh  YS Jagan  YSRCP leaders  AP Police  PM Modi  Chandrababu Naidu  Roja  APSCS  AP Politics  

Other Articles