'Cows safer than women in India' దేశంలో మహిళకన్నా గోవులకే ఎక్కువ రక్షణ..

Modern day chanakya should answer why friend tdp brought no trust vote asks uddhav thackeray

BJP, lynching, Narendra Modi, no-trsut vote, Sanjay Raut, shiv sena, Shiv Sena Saamana, TDP, uddhav thackeray

Shiv Sena president Uddhav Thackeray asked the BJP leadership to imbibe the true teachings of Chanakya and use their “neeti” for the country’s welfare, and says cows are much safer in the country than women.

మిత్రుడే అవిశ్వాసం ఎందుకు పెట్టాడు.? మోడీని నిలదీసిన శివసేన

Posted: 07/24/2018 10:56 AM IST
Modern day chanakya should answer why friend tdp brought no trust vote asks uddhav thackeray

ప్రధాని నరేంద్రమోడీని, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను అభినవ ఛాణక్యులుగా పేర్కోన్న శివసేన.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నాలుగేళ్లుగా మిత్రుడిగా వున్న మిత్రుడే.. కేంద్రప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో.. అభినవ చాణక్యులు దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ అన్ని అంశాలను రాజకీయ ప్రయోజనాలతో ముడివేస్తున్నందునే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న సందేహాలను అయన వ్యక్తం చేశారు.జ

మిత్రపక్షమైన టీడీపీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టిందో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం అధికార పక్షానిదని, అయితే అభినవ చాణక్యులు మాత్రం దీనిపై ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలని ఆయన ఉద్దవ్ థాకరే డిమాండ్ చేశారు. శివసేన పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభలో అవిశ్వాసం ప్రవేశపెట్టిందెవరో చూడండి. టీడీపీ పెట్టింది. టీడీపీ ఎవరు? బీజేపీకి మిత్రపక్షం. మిత్రులు ఎందుకిలా అవిశ్వాసం వ్యక్తంచేస్తున్నారన్నదే ప్రశ్న. దేశంలో తొలిసారి ఓ మిత్రపక్షం ఈ తీర్మానం తెచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
 
తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై మాట్లాడుతూ.. ‘ఎవరు ఎవరిపై అవిశ్వాసం చూపాలి. మేం ప్రతిపక్షంతో సాగాలా? కానీ ఇన్నేళ్లూ అవేం చేస్తున్నాయి? ప్రజలను ప్రభావితం చేసే అంశాలపై అవి మాట్లాడుతున్నాయా’ అని ఆక్షేపించారు. ఎన్డీయే పాలనలో దేశంలోని ఆవులకు రక్షణ ఉంది.. కానీ, మహిళలకు లేదు. ప్రపంచంలోనే మహిళలకు భద్రత లేని దేశంగా భారత్‌ మారింది. ఇందుకు సిగ్గుపడాలి’’ అంటూ మోదీ సర్కారుపై థాకరే విరుచుకుపడ్డారు. మూక దాడుల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘

ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే. కానీ, తప్పు జరుగుతుంటే తప్పకుండా మాట్లాడతాం. మేం భారతీయ జనతాకు మిత్రులం. అంతేకానీ, ఏ పార్టీకీ కాదు’’ అని వ్యాఖ్యానించారు. గోరక్షకులు పేరుతో దాడులు చేయడం సముచితం కాదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినా.. దాడులు ఆగడం లేదంటే.. ఈ విషయంలో ఎవరు దాడులకు ప్రేరణ కల్పిస్తున్నారు.? ఎవరు మూకలను ఉసిగొల్పుతున్నారన్న దిశగా విచారణ జరగాల్సి వుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ చెప్పే హిందూత్వను ఆయన బూటకంగా అభివర్ణించారు. గో సంరక్షకులను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై జాతివ్యతిరేకి అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమరి ఆయన ప్రశ్నించారు. ఎవరు జాతీయవాది? ఎవరు జాతి వ్యతిరేకి అన్న విషయాన్ని నిర్ణయించడానికి బీజేపీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒకరి జాతీయవాదాన్ని ప్రశ్నించేందుకు బీజేపి దాని అనుబంధ సంస్థలకు ఏమి అధికారముందని ఆయన ప్రశ్నించారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండి’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపుపై ఠాక్రే మండిపడ్డారు. ‘‘మేం సామాన్యుడి కల నెరవేర్చడానికి పోరాడుతున్నాం. మోదీ కల నెరవేర్చడానికి కాదు’ అని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  lynching  Narendra Modi  no-trsut vote  Sanjay Raut  shiv sena  Shiv Sena Saamana  TDP  uddhav thackeray  

Other Articles