David Headley battling for life after attack in US prison ముంబై దాడుల వ్యూహకర్త డేవిడ్ హెడ్లే సీరియస్..

David headley battling for life after attack in us prison

David Headley, Mumbai, terror attacks, bomb blast, master mind, David Coleman Headley, Daood Sayed Gilani, Sayed Salim Gilani, Mumbai court, North Evanston hospital, chicago jail, america, US

David Headley, Pakistani-American convicted in the 26/11 Mumbai terror attacks, is battling for his life after being attacked by two inmates at the Metropolitan Correctional Center in Chicago.

ముంబై దాడుల వ్యూహకర్త డేవిడ్ హెడ్లే సీరియస్..

Posted: 07/23/2018 07:07 PM IST
David headley battling for life after attack in us prison

ముంబై మహానగరంలో వరుస బాంబు దాడులతో మారణహోమాన్ని సృష్టించిన కేసులో (26/11) వ్యూహకర్త డేవిడ్ హేడ్లే పరిస్థితి విషమంగా వుంది. భారత మోస్టు వాంటెండ్ లిస్టులో వున్న ఈ నిందితుడిపై సహచర ఖైదీలు జరిగిప దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను జైలు అధికారులు హుటాహుటిన అసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమయంగా వుందని వైద్యులు వెల్లడించారని షికాగో జైలు అధికారులు మీడియాకు తెలిపారు.  

అమెరికాలోని షికాగో జైలులో శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ హేడ్లీపై ఇవాళ ఇద్దరు ఖైదీలు దాడి చేశారు. కొనేళ్ల కిత్రం పోలీసులను దుర్భాషలాడిన కేసులో దశాబ్దాల కాలం తరువాత పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి షికాగో కోర్టులో రిమాండ్ విధించారు. ఇక డేవిడ్ హెడ్లేపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులు అన్నదమ్ములని తెలుస్తుంది. ఈ దాడిలో హేడ్లే తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

కాగా, పాకిస్థాన్ సంతతికి చెందిన డేవిడ్ హేడ్లే అమెరికావాసి. ముంబైలో 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు హేడ్లే వ్యూహకర్తగా వ్యవహరించినట్టు నిరూపణ కావడంతో షికాగో కోర్టు అతనికి ముప్పై ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Headley  Mumbai  terror attacks  bomb blast  master mind  chicago jail  america  US  

Other Articles