lockers throw up Rs 500 cr cash, jewellery, assets మూడు లాకర్లలో రూ.530 కోట్లు.. రంగంలోకి ఐటీ అధికారులు

Bowring lockers throw up rs 530 crore cash jewellery assets

Bowring Institute, elite club, St Mark’s Road, Bengaluru, foreign currency, real estate businessman, Avinash Amarlal Kukreja, IT raids, badminton court, avinash amarlal kukreja, assets

In a stunning search operation, documents of property valued at over Rs 500 crore and Rs 14 crore assets, including cash, diamonds and gold, were recovered from lockers at the badminton court of Bowring Institute, an elite club, on St Mark’s Road in Bengaluru.

మూడు లాకర్లలో రూ.530 కోట్లు.. రంగంలోకి ఐటీ అధికారులు

Posted: 07/23/2018 06:21 PM IST
Bowring lockers throw up rs 530 crore cash jewellery assets

బెంగళూరులోని ప్రముఖులు, సంపన్నులు మాత్రమే వినియోగించే ఓ క్లబ్ లోని లాకర్లో గుప్త నిధులు బయటపడ్డాయన్న వార్త సంచలనం రేకెత్తించింది. ఈ క్లబ్ లో గుప్త నిధులేంటీ అంటారా.? ఔనండీ నిజమే ఈ క్లబులోని బ్యాండ్మింటన్ కోర్టు లాకర్లలో రూ. 500 కోట్లకు పైగా నల్లధనం వెలుగు చూసిన ఘటన కలకలం రేపుతోంది. బెంగుళూరు మహానగరంలోని సెయింట్ మార్క్స్ రోడ్డులో ఉన్న ఎలైట్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్న మూడు లాకర్లలో ఈ బ్లాక్ మనీ బయటపడింది.

రియలెస్టేట్ వ్యాపారి అవినాష్ అమరలాల్ కుక్రేజాకు చెందిన ఈ నల్లధనాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లాకర్లలో సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే చెక్కులు, ఆస్తుల పత్రాలతో పాటు రూ. 8 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, రూ. 3.9 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నగదు)తో పాటు కోటి ఎనబై లక్షల రూపాయల రూ.2000 వేల నోట్లు కట్లలను కూడా గుర్తించారు. ఈ మూడు లాకర్లను బెంగళూరులో స్థిరపడిన రాజస్థాన్ వ్యాపారవేత్తకు చెందినవి తెలిసింది. అవినాష్ అమర్ లాల్ కుక్రేజా ఈ లాకర్లను అక్రమంగా వినియోగిస్తున్నారని సమాచారం.

ఈ క్లబ్ లో సుమారు 1993 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్న అవినాష్.. బ్యాడ్మింటన్ అడేందుకు వస్తుంటాడు. అయితే అతని కన్నా ఎక్కువగా అతని తల్లి తన సహచరులతో కలసి పేకాట అడేందుకు ఇక్కడకు వస్తుంది. ఇక్కడ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన లాకర్లలో వారు ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్ తదితర వస్తువలు పెట్టకునేందుకు సభ్యులకు క్లబ్ యాజమాన్యం లాకర్లను కేటాయించింది. ఏళ్లుగా ఇక్కడున్న లాకర్లను క్లబ్ యాజమాన్యం పదే పదే చెబుతున్నా సభ్యులు తెరవడం లేదు. దీంతో క్లబ్ యాజమాన్యం లాకర్ల తాళాలను పగులగొట్టింది వాటిని శుభ్రపర్చే పనిచేపట్టగా, అవినాష్ అధీనంలోని 69, 71, 78 మూడు లాకర్ల నుంచి రూ. 530 కోట్ల రూపాయల విలువైన పత్రాలు, అభరణాలు, నగదు బయటపడటంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru  st mark's road  IT raids  badminton court  avinash amarlal kukreja  assets  

Other Articles