Two Rajasthan ministers battle it out for transfers పరస్పరం చేయిచేసుకున్న మంత్రులు..

Rajasthan ministers devnani bajiya scuffle over teachers transfer

Rajasthan ministers transfer battle, Rajasthan ministers teachers transfer battle, Rajasthan ministers slaping each other, Vasudev Devnani, Banshidhar Bajiya, vasundhara raje, Rajasthan government, Rajasthan minister, slapping, Transfer of teachers, PM Modi, Amit Shah

Huge embarrassment for Rajasthan Government when reports of heated arguments and scuffle between two ministers of Vasundhra Raje Government became viral in political corridors and on social media

పరస్పరం చేయిచేసుకున్న మంత్రులు..

Posted: 06/30/2018 02:23 PM IST
Rajasthan ministers devnani bajiya scuffle over teachers transfer

ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తలెత్తింది. అయితే సర్ధుకుని వెళ్లాల్సిన ఇద్దరు అమాత్యులు అహంభావంతో వ్యవహరించి.. నలుగురిలో చులకనయ్యారు. బదిలీల విషయంలో బెట్టువీడని మంత్రులు.. అధికారులు, ఉపాధ్యయుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. బీజేపిలో ప్రజాస్వామ్యం వుందని ప్రధాని వ్యాఖ్యానించిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన జరగడం.. మరీ ఇంత ప్రజాస్వామ్యం వుంటే కష్టమే నని నెట్ జనులు కూడా విమర్శిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్‌ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్‌ రాయ్‌ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు సంధిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles