Woman, daughter booked for sexual assault on boy బాలుడితో లైంగికవాంఛలు తీర్చుకుంటున్న తల్లికూతురు..

Woman daughter booked for sexual assault on boy in himachal

sexual abuse on boy, Shiv Kumar, minor boy sexually abused, crime, pocso act, Solan, sexually abuse, sexual offence, POCSO, nepalese woman, prostitution, Himachal Pradesh, crime

A Nepalese woman and her daughter have been booked for alleged sexual assault on a 17-year-old boy for over three months in Himachal Pradesh’s Solan district

బాలుడితో లైంగికవాంఛలు తీర్చుకుంటున్న తల్లికూతురు..

Posted: 06/30/2018 12:51 PM IST
Woman daughter booked for sexual assault on boy in himachal

న 17 ఏళ్ల కొడుకును వారి ఇంట్లో పెట్టుకుని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల ఆమె కూతురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివ కుమార్ వివరాలు వెల్లడించారు.

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ కింద ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశామని ఏఎస్పీ చెప్పారు. మైనర్‌ను వ్యభిచారం కోసం వాడుకోవడం కిందకు ఈ సెక్షన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలని, అందుకే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వివరించారు. అయితే నిందితులను అరెస్టు చేయలేదని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కుర్రాడి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. అతని కొడుకును మహిళ, ఆమె కుమార్తె తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. మూడు నెలలుగా ఆ కుర్రాడు వారి వద్దే ఉంటున్నాడు. ఈ మూడు నెలలపాటు తల్లీకూతుళ్లు తన కుమారుడిని లైంగికంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మహిళ భర్త గురించి మీడియా ప్రస్తావించగా.. ఆమె వితంతువా, లేదంటే భర్త నుంచి విడిపోయిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. బాధిత కుర్రాడు కూడా చదువు ఆపేశాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Solan  sexually abuse  sexual offence  POCSO  nepalese woman  prostitution  Himachal Pradesh  crime  

Other Articles