SCR Secunderabad Apprentice Posts Recruitment 2018 ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్..

Scr secunderabad apprentice posts recruitment 2018 iti candidates are eligible

railway jobs, railway recruitment, railway recruitment apply online, central railway recruitment 2018, jobs for 10th pass, jobs for 12th pass, central railway apprentice 2018, central railway website, indian railways recruitment, indian railways recruitment 2018, indian railways vacancy, indian railways recruitment notification, job alert 2018, job alert railway

SCR Secunderabad has announced a notification for the recruitment of Apprentice vacancies in South Central Railway for the year 2018-19.

ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్..

Posted: 06/28/2018 12:28 PM IST
Scr secunderabad apprentice posts recruitment 2018 iti candidates are eligible

ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటీస్ కోసం వేచిచూస్తున్న సంబంధిత ట్రేడ్ అశావహులకు అప్రంటీస్ తో పాటు ఉద్యోగాలను కూడి ఇచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,103 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

అభ్యర్థులు పదో తరగతితో 50శాతం పర్సెంటేజీతో ఉత్తీర్ణులై, ITI క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్ లో రైల్వే స్ఫష్టం చేసింది. రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 616, ఎస్టీలకు 308, వెనుకబడిన తరగతుల వారికి 1107, జనరల్ కేటగిరీ వారికి 2వేల 72 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చివరి తేదీని జులై 17. కాగా ఈ ఉద్యోగాలకు అప్ లైన్ లో కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. www.scr.indianrailways.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ను డౌట్ లోడ్ చేసుకుని పూర్తిచేసి.. The Deputy Chief Personnel Officer/ A & R/ SCR, RRC, 1st Floor, C-Block, Rail Nilayam, Secunderabad చిరునామాకు పంపాలి.

ఏసీ మెకానిక్‌ విభాగంలో 249 పోస్టులు, కార్పెంటర్‌ విభాగంలో 16, డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో 640, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 18, ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 871, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 102, ఫిట్టర్‌ విభాగంలో 1,460, మెషినిస్ట్‌ విభాగంలో 74, MMWవిభాగంలో 24 , MMTM విభాగంలో 12, పెయింటర్‌ విభాగంలో 40, వెల్డర్‌ విభాగంలో 597 పోస్టులు ఉన్నాయి. జూన్ 18 నాటికి 24 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే ఉద్యోగ ఎంపిక మాత్రం అభ్యర్థులు పదో తరగతి ఫలితాలతో పాటు ఐటీఐ మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకుని చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles