Google ads in Telugu now గూగుల్ ప్రకటనలు ఇక తెలుగులో.. వైబ్ సైట్లకు ఆదాయమే..

Google extends support for telugu language ads

google, search engine, telugu, adwords, adsence, business, ads, advertisements, google latest news in telugu, google adwords telugu, google adsense telugu, google search engine, business news in telugu, ads in telugu, Google, telugu language, telugu ads, telugu, sundar pichai, monetisation, AdSense, Google AdSense, Google AdWords, AdWords

Google India launched Telugu language support for two advertising products, Google AdWords and Google AdSense, which it expects to facilitate Telugu web publishers and advertisers reach out to a large base of Internet users in the language.

గూగుల్ ప్రకటనలు ఇక తెలుగులో.. వైబ్ సైట్లకు ఆదాయమే..

Posted: 06/28/2018 11:45 AM IST
Google extends support for telugu language ads

సాంకేతిక దిగ్గజంగూగుల్ నుంచి తెలుగువారికి శుభ‌వార్త‌. టాప్ సెర్చింజ‌న్ గూగుల్ దాని ప్రకటన ఉత్పత్తులైన గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్‌లలో తెలుగు సపోర్ట్‌ను ఇస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలుగు వెబ్‌సైట్లు, అడ్వర్‌టైజర్‌లకు తెలగు భాషలో యాడ్ సెన్స్‌ను అందుభాటులోకి తెస్తున్నాం.దీని ద్వారా లక్షలాదిగా ఉన్న తెలుగు ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ చేరువకానుంది అని గూగుల్ సాత్ ఈస్ట్ ఏషియా, ఇండియా ఉపాధ్యక్షులు ఆనందన్ తెలిపారు.

ఇప్ప‌టిదాకా భార‌తీయ భాష‌ల్లో కేవ‌లం హిందీ, బెంగాలీ, త‌మిళ భాష‌ల వెబ్‌సైట్ల‌కు మాత్ర‌మే ఈ వెసులుబాటు ఉంది. ఈ సందర్బంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ భారతీయ భాషల్లో యాడ్‌సెన్స్‌ను అందుభాటులోకి తీసుకురావడంతో పాటు, వంద కోట్ల భారతీయులకు ఇంటర్నెట్ ఉపయోగపడేల చేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. తెలుగు లో వెబ్ సైట్లను నడిపిస్తున్న వారు ఇకపై తమ అకౌంట్‌తో లాగ్ ఇన్ అయ్యి గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్‌ని పొందవచ్చన్నారు.

దీని ద్వారా వారి కంటెంట్‌ను వారి వినియోగదార్లకు సేవలంధించడంతో పాటు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారిలో దేశీయంగా 234 మిలియన్‌ల మంది ఉన్నారని, 2021నాటికి ఆ సంఖ్య 536 మిలియన్లకు చేరనున్నట్లు గూగుల్ ఇండియా మార్కెటింగ్ సర్వీస్ డైరెక్టర్ షాలిని గిరీష్ అన్నారు. హిందీ, బెంగాలి, తమిళ భాషల్లో గూగుల్ యాడ్ సెన్స్‌ను అందుబాటులోకి తర్వాత ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తెస్తున్నామని ఆమె తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  search engine  telugu  adwords  adsence  business  ads  advertisements  

Other Articles