BJP free to fight elections alone: JD(U) అధికార కూటమి మధ్య లుకలుకలు.. మీఇష్టమన్న జేడీయు

Bjp free to fight elections alone in bihar if it doesn t need ally

National Democratic Alliance (India), Janata Dal (United), elections, BJP, Janata Dal (United), Bihar, Politics

JD(U) stated that the Bharatiya Janata Party (BJP) is free to contest from all 40 seats in the state alone, if it does not need help from its alliances.

అధికార కూటమి మధ్య లుకలుకలు.. మీఇష్టమన్న జేడీయు

Posted: 06/26/2018 01:18 PM IST
Bjp free to fight elections alone in bihar if it doesn t need ally

రానున్న సార్వత్రిక ఎన్నికలలో.. అవకాశమున్న అన్ని చోట్లు బరిలోకి దిగాలని, మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న బీజేపి.. అప్పుడే మిత్రులతో పొత్తు విషయాలపై చర్చను తీసుకువచ్చింది. ఈ క్రమంలో గత ఎన్నికలలో గెలిచిన అన్ని స్థానాలలో తాము పోటీకి సిద్దమన్న ప్రకటనలను పార్టీ నేతలు ఇవ్వడంతో.. అధికార కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. తమతో పొత్తు వద్దనుకున్న నేపథ్యంలో ఒంటిరిగా బరిలోకి దిగే స్వేచ్చ ఆ పార్టీకి వుందని అధికార పార్టీ జేడీయూ తేల్చిచెప్పింది. ఇంతకీ ఎక్కడా.. అంటే మహాకూటమితో ఎన్నికలకు వెళ్లి.. తరువాత బీజేపిపై మొగ్గుచూపిన బీహార్ లోని అధికార జేడీయు పార్టీతో బీజేపి బయటపడ్డాయి.

రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జేడీయూ జనరల్ సెక్రటరీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నితీశ్ లేకుండా బీహార్‌లో తాము గెలవలేమని బీజేపీకి కూడా తెలుసు. మాతో కనుక పొత్తు వద్దనుకుంటే రాష్ట్రంలోని 40 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసుకోవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు’’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అనవసర, అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నేతల నోళ్లను అదుపులో పెట్టాలని బీజేపీకి సూచించారు. ‘‘రాష్ట్రంలోని బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’’ అని ఆయన హెచ్చరించారు.

2014లో గెలిచిన అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని  ఇటీవల బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో మిత్ర పక్షాలను కూడా గౌరవిస్తుందని పేర్కొన్నారు. సీట్ల పంపకం సరైన పద్ధతిలో చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని 40 సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా, మిత్ర పక్షాలు మరో 9 సీట్లు గెలుచుకున్నాయి. జేడీయూ రెండింటితోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఆ సీట్లన్నీ తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అది కుదరని పని జేడీయూ చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య చెడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles