janasena for a revolutionary change in Andhra politics రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు పవన్ కల్యాణ్..

Janasena for a revolutionary change in andhra politics

Pawan Kalyan, Pawan Kalyan news, Pawan Kalyan updates, Pawan Kalyan latest, Pawan Kalyan new, Pawan Kalyan next, Pawan Kalyan speech, Pawan Kalyan political view, Pawan Kalyan new steps, janasena, jana sena, pawan kalyan, power star, bjp-tdp allaince, janasena 2019 elections, janasena revolutionary party, Andhra Pradesh, politics

Janasena Chief Pawan Kalyan floated his own political party JanaSena only for Questioning the politicians, but when he along with people of AP betrayed in SCS after supporting BJP-TDP alliance for a term is fighting forth coming elections for the people.

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు పవన్ కల్యాణ్..

Posted: 06/25/2018 04:23 PM IST
Janasena for a revolutionary change in andhra politics

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి.. ఎన్నికలు ముగిసీ ముగియగానే ప్రజల కష్టనష్టాలను వారికే వదిలేసే రాజకీయాలకు చరమగీతం పాడాలని కంకణబద్దులై సినీనటుడు పవర్ స్టార్ ఫవన్ కల్యాణ్.. స్థాపించిన పార్టీ జనసేన. పునర్విభజనతో రాష్ట్రం ముక్కలవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజల భాధను, అవేదనను అంతకుమించిన అందోళనను అర్థం చేసుకుని వారి అండగా నిలుస్తానని, మరీ ముఖ్యంగా అడపడుచులకు అభయప్రధాతగా మారుతానని చెప్పారు. రాష్ట్రంలోని సామాన్యుడి గొంతునవుతానని ప్రకటించారు. ఎన్నికల హామీలను నెరవేర్చని రాజకీయ నేతలకు తాను ప్రశ్ననవుతానన్నారు. అప్పుడు గాఢాంధకారం అలుముకున్న రాష్ట్రాన్ని, చీకట్లో తమ బతుకులపై భయాంధోళన వ్యక్తం చేస్తున్న ప్రజలను చూసి చలించిపోయిన పవన్.. పార్టీని స్థాపించి తాను అండగా వున్నానని ప్రకటించారు.

అయితే చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. అప్పడు రాష్ట్రంలో ఎలా వుందో.. ఇప్పుడూ అలానే వుంది. అభివృద్ది పేరులో తప్ప.. పేపరు మీద లెక్కల్లో తప్ప.. ఎక్కడా కనిపించలేదు. రాజధాని ప్రాంతం ఎంచుకోవడం నుంచి తాత్కాలిక కార్యాలయాలు, శాశ్వత భవనాల నిర్మాణాల వరకు పాలకుల దృష్టి మొత్తం అక్కడే. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన పార్టీలు.. ఐదో ఏడు పాలన సమీపిస్తున్నా.. అవగింజంత ప్రాంతంపైనే ద్యాస. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అభివృద్దిపై ఏదీ శ్రద్ద.. రాష్ట్ర రైతాంగానికి ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి.. ఆనక అనేక అంక్షల నడుమ కొందరికి మాత్రమే రుణాలు మాఫీ కావడం ఆయనను కదిలించింది.

ప్రజారోగ్యం, విద్య, ఎన్నికలలో డబ్బు, సారా, ఛీప్ లిక్కర్ లకు ప్రాధాన్యత పెరగడం ఆయనను అవేదనకు గురిచేసింది. అసలు ప్రభుత్వమే అధికారికంగా మద్యాన్ని అమ్మి.. ప్రజారోగ్యాన్ని కాలగర్భంలో కలిపి.. అనేక కుటుంభాలు ఛిధ్రమౌతున్న పట్టకుండా ఆదాయం సమకూర్చుకోవడమేంటని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టును కేంద్రానికే అప్పజెప్పక.. రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం తీసుకోవడమే రైతంగానికి శాపంగా పరిణమించిందని చెప్పారు. అటు ప్రత్యేక హోదా రాక.. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చేసిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నా.. కాయితాల మీద కంపెనీలు వస్తున్నాయే తప్ప.. పట్టుమని పదివేల మందికి ఉద్యోగాలు ఇప్పించలేని స్థితి నెలకొందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాజకీయ విశ్లేషకుడు, వ్యాపారవేత్త దిలిప్ బైరాతో మాట్లాడుతూ.. తమ మదిలోని నిగూఢమైనఅనేక విషయాలను, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పంచుకున్నారు.

అనుకున్నంతా జరిగింది.. రాష్ట్రం విడిపోయింది.. రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఈ అన్యాయాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూ.., ఆయన అటు కేంద్రంలోని బీజేపికి, ఇటు రాష్ట్రంలోని టీడీపీకి తన మద్దతును తెలిపారు. తాను కానీ, తన పార్టీ కానీ ఎలాంటి రాజకీయ లభ్దిని అలోచించకుండా కేవలం ఆ పార్టీలకు ఓటేస్తే చాలు.. ఏపీ ప్రజల ఆశలు, అకాంక్షలు అన్నీ తిరుతాయని చెప్పారు. ఒక వేళ ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజల అకాంక్షలను నెరవేర్చని పక్షంలో తాను ప్రజలకు అండగా నిలబడి వారిని ప్రశ్నిస్తానని ప్రకటించారు.

అటు బీజేపి, ఇటు టీడీపీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే ఏడాది గడిచిన తరువాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో.. అసలు దాని గురించి రాష్ట్రానికి చెందిన ఎంపీలు అలోచించక పోవడం.. ఆయనను విస్మయానికి గురిచేసింది. మన రాష్ట్ర ఎంపీలు తమ వ్యాపార, వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే ఎన్నికలలో నిలుస్తున్నారని, తెలంగాణ ఎంపీల మాదిరిగా.. చిత్తశుద్దితో పోరాటం చేయడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఎంపీలు చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని సూచించారు.

అప్పట్నించి ఆయన గళం విప్పుతూనే వున్నారు. ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అనేక పర్యాయాలు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నాపాలు చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వున్న రాజకీయ మైత్రికి బీటాలు వారుతూ వచ్చింది. రాష్ట్రంలో రాజకీమ ముఖచిత్రంలో పూర్తిగా మార్పు వచ్చింది. దీంతో తాను ప్రజల పక్షాన నిలిచి పశ్నిస్తానన్న నేత.. పవన్ కల్యాన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. శత్రువులు ఎదురోడ్డినా నిలవచ్చు.. కానీ మిత్రరూపంలో వున్న శత్రువులు పొడిచే వెన్నపోట్లను తట్టుకోవడం చాలా కష్టం. రాజకీయాల్లోకి వెళ్తే అన్నింటినీ భరించాలని తెలిసే వచ్చానని చెప్పుకోచ్చిన పవన్.. మేకతోలు కప్పుకున్న పులుల వెన్నులో వెణుకుపుట్టిస్తున్నారు.

ఈ క్రమంలో ఉత్తరాంధ్రపోరాట యాత్రలో ఆయన ప్రజలతో మమేకవుతూ వారి కష్టాలను చూసి భరించలేకపోతున్నారు. గర్భిణీ మహిళలకు స్థానిక పీహెచ్ సీలలో కనీసం ఒక గైనకాలజిస్టు కూడా లేకుండా పోతున్నార దౌర్భాగ్యపు పరిస్థితులు ఎందుకు దాపురించాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అదాయం కింద తీసుకునే ప్రతీ రూపాయిలో తమ వాటాగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇస్తున్నారు కదా.. మరీ ఇన్నేళ్ల స్వతంత్ర్య భారతంలో ఇంకా ఈ వెనకబాటు తనమెందుకు.. అభివృద్ది అంతా ఒక్కచోటే ఎందుకు అని ఆయన నిలదీస్తున్నారు.

ప్రజల నుంచి పత్యక్ష, పరోక్ష పన్నులను ముక్కుపిండి మరీ వసూళు చేసే ప్రభుత్వం.. ప్రజారోగ్యాన్ని విస్మరించడమేంటని ప్రశ్నించారు. రోగం వ్యాప్తి చెందితేనే ప్రభుత్వాలు స్పందిస్తాయా.? అని అడిగారు.  అసలు ప్రజల అరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా.? అంటూ నిలదీస్తున్నారు. ఆదాయ వసూళ్లకు మాత్రమే ప్రజలు.. కానీ వారి అరోగ్యాలకు మాత్రం కార్పోరేట్ అసుపత్రులా.? ఎందుకు.? కార్పోరేట్ అసుపత్రులను ప్రభుత్వాలే పెంచిపోషిస్తున్నాయా అన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని పవన్ కల్యాన్ గుర్తుచేశారు. ప్రజలు అనారోగ్యం పాలై మరణిస్తే అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని.. కార్పోరేట్ వైద్యం కన్నా ముందు పీహెచ్ సీలలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చి.. అన్ని రకాల మందులు లభ్యమయ్యేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇక విద్య గురించి కూడా ప్రస్తావించిన ఆయన రాష్ట్రంలో విద్య కూడా కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని అందోళన వ్యక్తం చేశారు. కోరుకొండ సైనిక్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, చిల్మూర్ విద్యాపీఠం, నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ పాఠశాల, కర్నూలు సిల్వర్ జూబ్లీ కాళాశాలు తమ ప్రాధాన్యతను ఎందుకు కోల్పోయాయని ప్రశ్నించారు. ఇందులో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యాపారులు తమ వ్యాపార విస్తరణే పరమావధిగా చర్యలు చేపడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

తద్వారా దశాబ్దాల కాలం వరకు ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలు కాలక్రమేనా కాలగర్భంలో కనిపించకుండా, వినిపించకుండా పోతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అంటే కేవలం తరగతి విద్య మాత్రమే కాదని, మనోవికాసం, శరీరిక దారుడ్యం, మేధో సంపత్తి, అవగాహన, సత్బుద్ది, సత్పప్రవర్తన లాంటి అనేకమని.. అవి నేటి కార్పోరేట్ పాఠశాలల్లో ఎక్కడున్నాయని జనసేనాని అందోళన చెందారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదా.? అని పశ్నించారు. 50, 60 దశకాల్లో మాదిరిగా రాజకీయాల్లోకి మేధావులు, సేవాతాత్పరులు కాకుండా కాంట్రాక్టర్లు, కార్పోరేట్లు, వ్యాపారులు, నేరగాళ్ల వశమైందని అందోళన వ్యక్తం చేశారు. ఈ భావాలు సమాకాలని రాజకీయా నేతల్లో మచ్చకైన కనిపించవు. అయితే తమపార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మద్యనిషేధంతో పాటు ప్రజలందరికీ అరోగ్యం, విద్య కనీస బాధ్యతగా గుర్తించి అందిస్తుందని సమాచారం. ఇలాంటి భిన్నమైన భావాలున్న విప్లవాత్మక నేత ఈసారి అధికారం అందుకోవాలని.. అశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles