TV anchor Tejaswini husband pawan arrested టీవీ యాంకర్ తేజశ్విని అత్మహత్య కేసులో భర్త అరెస్టు

Husband extramarital affair led to tv anchor tejaswini suicide

TV Anchor, News Reader Tejaswini, vijayawada news reader, vijayawada tv anchor, news reader tejashwini suspicious death, tv anchor tejashwini suspicious death, tv anchor, news reader, tejaswini, pavan kumar, local channel, eedupugallu, mbvr colony, vijayawada, crime

Vijayawada police arrest husband of local TV news channel reporter Tejaswini, pawan kumar, who found to have an affair with another woman, that lead to tejaswini suicide. The incident took place in Eedupugallu, MBVR Colony of vijayawada

టీవీ యాంకర్ తేజశ్విని అత్మహత్య కేసులో భర్త అరెస్టు

Posted: 06/19/2018 02:23 PM IST
Husband extramarital affair led to tv anchor tejaswini suicide

కుటుంబ కలహాల కారణంగా టీవీ యాంకర్ తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఘటన విజయవాడలో కలకలం రేపగా, అత్తతో అమె గొడవపడిన తరువాత గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి బిగించుకుని అత్మహత్యకు పాల్పడిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఈ కేసులోని మరో ట్విస్టును కూడా వెలికి తీసారు. ఆత్మహత్యకు ముందు తేజశ్విని రాసిన సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కడంతో ధర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు భర్త వేధింపులే అమె మరణానికి కారణమని తేల్చారు.

తేజస్వీ మరణాన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అమె మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య వెనుక ఆమె భర్త పవన్ కుమార్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉండగా, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. పవన్ ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని తెలిపారు.

కంకిపాడు పీఎస్ లో తేజస్విని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సూసైడ్ నోట్ లో తేజస్విని రాసిన వివరాలు, ఆమె తల్లిదండ్రులను విచారించిన తరువాత తమకు లభించిన వివరాలకు పొంతన లేదని, ఆ కారణంతోనే కేసు విచారణ జటిలమైందని తెలిపారు. ప్రస్తుతం పవన్ కుమార్ ఫోన్ ను సీజ్ చేశామని, దానిలోని సమాచారాన్ని విశ్లేషించగా, తేజస్వినికి వేధింపులు నిజమేనని తేలిందని, సాధ్యమైనంత త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor  news reader  tejaswini  pavan kumar  local channel  eedupugallu  mbvr colony  vijayawada  crime  

Other Articles