barbers called-off strike after chandrababu's warning చంద్రబాబు భయంతోనే క్షురకుల సమ్మె విరమణ..?

Barbers called off strike after chandrababu s warning

Chandrababu, ap chief minister, CM chandrababu warnings viral, CM Chandrababu warning to barbers, chandrababu convoy stopped by convoy, Amaravati, warnings, Temple barbers, Andhra Pradesh

Andhra pradesh chief minister nara chandrababu warns temple barbers, after they suddenly stops his convoy at amaravathi. The TDP National president said govt cannot consider them as employees, but raises their income more than double. At a stage he warned barbers, that he know to cut their tails

ITEMVIDEOS: క్షురకుల సమ్మె విరమణకు సీఎం అవేశమే కారణమా.?

Posted: 06/19/2018 01:25 PM IST
Barbers called off strike after chandrababu s warning

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో క్షురకులుగా వున్న నాయీబ్రహ్మణులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్వయంగా వారితో మాట్లాడుతూ.. ఆగ్రహావేశాలకు లోనైన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తమకు కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేవాలయాల్లో పని చేస్తున్న క్షురకులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి వస్తున్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న డిఫ్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, వారితో చర్చలు నిర్వహించగా, అవి విఫలమయ్యాయి. వారు తమకు కనీసం వేతనంలో పాటు పీఎఫ్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.

దీంతో తాను వారి డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన కేఈ.. చర్చలను ముగించడంతో.. వారు అమరావతి నుంచి బయటకు వస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనం వెళ్లడాన్ని గమనించి వారు అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబుకు అగ్రహానికి లోనయ్యారు. క్షురకుల డిమాండ్లను అంగీకరించే ప్రసక్తే లేదని, అయితే వారి అర్థికస్థితి మెరుగయ్యేందుకు ప్రస్తుతం 12 రూపాయలుగా వున్న శిరోమండన రుసుమును రూ.25గా చేస్తున్నామని, ఇందులో మొత్తం క్షురకులకే అందేట్లు కూడా చర్యలు తీసుకుంటామని అక్కడికక్కడే ప్రకటించారు.

అయితే వారు తమను ఉద్యోగులుగా పరిగణించాలని, కనీస వేతనాలను కూడా కల్పించాలని, ఫీఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. అయితే అది కుదరదని, ప్రభుత్వం అందుకు ఒప్పుకోదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా క్షురకులు తమవి న్యాయమైన కోర్కేలేనని అనడంతో చంద్రబాబుకు కోపం వచ్చింది. ఎవరివి న్యాయమైన కోర్కెలు.. ఇట్రా.. ఇట్రా అంటూ ఓ క్షురకుల ప్రతినిధిని పిలిచి.. నీదు ఏ ఊరు అని గట్టిగా అడిగేసరికి ఆయన మిన్నకుండిపోయారు. ఇచ్చింది తీసుకుని చక్కగా వెళ్లండి.. మీకు వస్తున్నది 12 నేను దాన్ని రెట్టింపుకన్నా అధికం చేశాను.. మీరు చేసిన దానికి అసలు అలా చేయకూడదని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇక దీనికి తోడు కాన్వాయ్ ను అడ్డుకోవడమేంటని.. ఇలా చేస్తే మీ తోక్కలు కట్ చేస్తానని కూడా చంద్రబాబు వారితో అన్నారు. సంతోషంగా వెళ్లండి లేదంటే అని గద్దించారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన క్షురకులు సమ్మెను కొనసాగిస్తామనే అమరావతి నుంచి బయటకు వచ్చినా.. రెట్టింపు కన్నా అధికంగా రుసుము అందుతుండటంతో సంతోషించారు. ఇవాళ నేరుగా విధులకు హాజరవుతూ.. సమ్మెకు స్వస్తి పలికినట్లు ప్రకటించారు. ఇదంతా ఏపీ సెక్రటేరియట్ ముందు, బహిరంగంగా జరగడంతో ఈ వ్యవహారానికి ప్రచారం వస్తోంది.

అయితే కొందరు క్షురకులు మాత్రం.. గత ఎన్నికల ముందు విడుదల చేసిన మెనిఫెస్టోలో నాయిబ్రహ్మణులకు కనీస వేతనాలు అనే హామీ కూడా పేర్కోన్న బాబు.. ఇప్పుడు కుదరదని చెప్పడమేంటని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అనధికారంలో వున్నప్పుడు ఓ మాట.. అధికారం అందాక మరోమాట మార్చడంపై వారు మండిపడుతున్నారు. ఓట్లకు ముందు తీయ్యగా మాట్లాడే నేతలు.. సీటులోకి ఎక్కిన తరువాత రంగుమార్చడాన్ని కూడా గమనిస్తున్నారని పలువరు క్షురకుల ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  convoy  Amaravati  warnings  Temple barbers  Andhra Pradesh  

Other Articles