2 Per Litre In 14 Days, Diesel By Rs. 1.5 Per Litre 14 రోజులకు రూ. 2మేర తగ్గిన పెట్రోల్ ధర

Petrol price cut by rs 2 per litre in 14 days diesel by rs 1 5 per litre 10 points

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price, Iran, excise, VAT, Opec, Venezuela

Petrol and diesel prices today were cut by 15 paise per litre and 10-11 paise per litre. Tuesday marked the 14th straight reduction in the price of petrol while diesel price was lowered for thirteen days since May 29.

14 రోజులకు రూ. 2మేర తగ్గిన పెట్రోల్ ధర

Posted: 06/12/2018 10:57 AM IST
Petrol price cut by rs 2 per litre in 14 days diesel by rs 1 5 per litre 10 points

కర్ణాటక ఎన్నికల తరువాత వరుసగా 16 రోజుల పాటు పెరుగుతూ వాహనదారులకు చుక్కులు చూపిన ఇంధన ధరలు క్రమంగా గత నెల 29 నుంచి వరుసగా 14 రోజుల పాటు తగ్గుతూ వస్తున్నాయి. 16 రోజుల పాటు సుమారుగా నాలుగు రూపాయల మేర పెరిగిన ఇంధన ధరలు.. 14 రోజుల వ్యవధితో రూ.2 మేర తగ్గాయి. గత నెల 14 నుంచి 18 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే రూపాయి మేర పెరిగిన ఇంధన ధర.. గత నాలుగు రోజుల వ్యవధిలో రూపాయి మేర తగ్గముఖం పట్టింది. ఇది వాహనదారులకు కొంత ఊరట కలిగించే విషయమే.

అయితే 16 రోజుల వ్యవధిలో పెంచిన ధరలో అర్థశాతం మేర 14 రోజుల్లో తగ్గింది. అయినా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రోల్ ధర లీటరు రూ. 80 పైగానే కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ మార్కెట్లో చమురు ధరలు దిగివస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు కూడా దిగివస్తున్నాయి. కాగా ఇవాళ వాహనదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్ ధరలు  పెట్రోలు ధరను 15 పైసలు, డీజెల్ ధరను 10 పైసలు తగ్గించిన్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.  

ఇక తాజా తగ్గింపు ధరల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా వున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ 75.43 రూపాయలుండగా, లీటరు డీజిల్ 67.95గా కొ నసాగుతుంది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్ ధర 84.26గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర 72.24గా వుంది.. కోల్ కతా నగరంలో లీటరు పెట్రోల్ ధర79.1గా నమోదవ్వగా, లీటరు డీజిల్ ధర 70.4గా కొనసాగుతుంది. ఇక తాజా ధరల నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర 80.96గా కొనసాగుతుండగా, లీటరు డీజిల్ ధర రూ.67.85గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  dharmendra pradhan  goods and service tax  

Other Articles