Petrol prices down 10p to 12p today in India ఇం‘ధనం’ లూటీ: 16 రోజుల్లో రికార్డుస్థాయికి.. 8 రోజుల్లో 71 ఫైసలా.?

Petrol price dips 71 paise diesel 51 paise in 8 days

petrol diesel price,petrol price hike,diesel price hike,petrol price today,diesel price today, fuel price today,fuel price,fuel prices,fuel price hike,fuel price cut,petrol price hike,petrol price cut,latest fuel price,latest petrol price,latest diesel price,fuel price on monday,fuel price on june 6,fuel price on 6 june

The decreasing price trend, which started on May 30, continued with the dip in prices of petrol by 11 paise and diesel by 8 paise in the national capital, which have dropped 71 paise and 51 paise, respectively, in eight days.

ఇం‘ధనం’ లూటీ: 16 రోజుల్లో రికార్డుస్థాయికి.. 8 రోజుల్లో 71 ఫైసలా.?

Posted: 06/06/2018 05:54 PM IST
Petrol price dips 71 paise diesel 51 paise in 8 days

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా వాహనదారులు మాత్ర ఆ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసీముగియగానే అప్పటి వరకు 19 రోజుల పాటు స్థిరంగా ఎలాంటి మార్పులు లేకుండా వున్న ధరలు.. ఒక్కసారిగా ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లాయి. మే 14 నుంచి 18వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్ పై రూపాయి పెరిగింది. ఆ తరువాత మే నెల 29 వరకు వరుసగా పెరుగుతూనే వచ్చిన ఇంధన ధరలు మొత్తంగా 16 రోజుల వ్యవధిలో అల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ పదహారు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై ధర రూ. 3.80, డీజిల్‌పై ధర రూ. 3.38 వరకు పెరిగింది.

అయితే మే 30 నుంచి రూపాయి మేర ఇంధన ధర తగ్గిందని, ఆ తరువాత అది రూపాయి కాదు కేవలం ఫైసా మాత్రమేనని చెప్పిన నాటి నుంచి వరుసగా ఎనమిది రోజుల పాటు ఇంధన ధరలు తగ్గాయి. పెంచేప్పుడు నాలుగు రోజుల వ్యవధిలో రూపాయి మేర పెంచిన అయిల్ కంపెనీలు.. తగ్గింపు సమయంలో మాత్రం తగ్గిన మేర వాహనదారులకు లబ్ది చేకూర్చడం లేదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. వరుసగా ఎనమిది రోజులు తగ్గినా.. అవి గత ఏడు రోజుల మాదిరిగానే స్వల్పంగానే తగ్గాయి. ఇవాళ పెట్రోల్ పై 11 పైసలు, డీజిల్ పై 8 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో గత ఎనమిది రోజుల నుంచి ధరలు తగ్గిస్తున్నా అవి ఏ మేర తగ్గాయో తెలిస్తే మాత్రం విస్మయం వ్యక్తం చేయడం తప్పదు. మొత్తానికి వరుసగా గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్‌ ధర 71పైసలు; ఏడు రోజుల్లో డీజిల్‌ ధర 53 పైసలు తగ్గింది. పెంచేప్పుడు రూపాయల్లో తగ్గించేపుడు మాత్రం పైసల్లో.. పెంచేప్పుడు నాలుగు రోజుల్లో రూపాయి.. తగ్గించేప్పుడు 8 రోజులైనా తాకని రూపాయి. ఇలా అయిల్ కంపెనీలు ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నాయన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగటంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువ భారీ పతనం కావటం కూడా ధరలు పెరగుదల, తగ్గింపులకు కారణమని చెబుతున్న ఆయిల్ కంపెనీలు.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వరుసగా 19 రోజుల పాటు అంతర్జాతీయ రేట్లలో తేడాలు లేవని ధరలను స్థిరంగా వుంచారా.? అన్న ప్రశ్నలు వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ధరలను నియంత్రిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలపై ఇంతటి భారం పడుతున్నా ఇంకా ఎందుకు తగు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక మరికోందరి నుంచి అసలు ప్రభుత్వాలు ప్రజల కోసం వున్నాయా.? లేక ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి వున్నాయా.? అన్న ప్రశ్నలు సైతం రైడర్స్ సంధిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles