Pawan Kalyan to campaign in karnataka elections కర్ణాటక ఎన్నికలలో ఆ పార్టీకే పవన్ ప్రచారం

Pawan kalyan to campaign in karnataka elections

Jana sena, Pawan Kalyan, twitter, IAS topper, karnataka assembly elections, JDS, Kumara swamy, telugu people, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan to campagn for JDS party in north karnataka, this is comformed by JDS chief kumaraswamy.

కర్నాటక ఎన్నికలలో పవన్ ప్రచారం ఫిక్స్.. ఆ పార్టీకే మద్దతు

Posted: 04/28/2018 10:09 AM IST
Pawan kalyan to campaign in karnataka elections

కర్ణాటక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టు కన్ఫామ్ అయ్యింది. ఆయన ఉత్తర కర్ణాటకలోని తెలుగువారు అధికంగా వుండే ప్రాంతంలో ప్రచారం చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన ఏ పార్టీకి కాకుండా కేవలం తన స్నేహితుల తరుపున మాత్రమే ప్రచారం చేయనున్నారన్న వార్తలుకూడా వినిపించాయి. కాగా, తాజాగా ఆ ఊహాగానాలన్ని తప్పని తేలిపోయింది.

జనసేనాని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారన్న మాట ముమ్మాటికీ వాస్తవమే అయితే అది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ఇటు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మకద్రోహం చేసిన బీజేపిలకు కాకుండా తన మిత్రుడైన జేడీఎస్ అధినేత కుమారస్వామికి మద్దతుగా పవన్ కల్యాన్ ఈ సారి ఎన్నికలలో ప్రచారం చేస్తారని కన్ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని జేడీఎస్ చీఫ్ కుమారస్వామియే స్వయంగా వెల్లడించారు. మే నెల తొలివారంలో పవన్ కల్యాన్ తమపార్టీ తరపున ప్రచారం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలతోపాటు ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్‌తో ప్రచారం చేయించడం ద్వారా వారి ఓట్లను కొల్లగొట్టాలనేది కుమారస్వామి ఆలోచన. ఇక్కడ కనీసం 18 స్థానాలైనా గెలవాలని జేడీఎస్ పట్టుదలగా ఉంది. జేడీఎస్ తరపున ఇప్పటికే హీరోయిన్ పూజాగాంధీ, జాగ్వార్ హీరో నిఖిల్‌లు ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు.

ఇక మరోవైపు సివిల్స్ టాపర్లకు కూడా జనసేనాని అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ ద్వారా మెట్‌పల్లి జిల్లాకు చెందిన సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నిన్ను చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఈ మూడు వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం కూడా అనుధీప్ లక్ష్యసాధనకు దోహదపడ్డాయని జనసేనాని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles