20 students dead as school bus falls into gorge ప్రమాదానికి గురైన స్కూలుబస్సు.. 26 మంది చిన్నారుల మృతి

20 students dead as school bus falls into gorge in himachal pradesh

Himachal Pradesh bus accident, Himachal school bus accident, Kangra school bus accident, Kangra, Wazir Ram Singh Pathania Memorial Public School, Wazir Ram Singh School, Nurpur, malkwal, himachal accicent, Dharamshala, School bus, george, Crime

At least 26 students were killed as a school bus owned by a private school, Wazir Ram Singh Pathania, fell into a deep gorge near Malkwal area of Nurpur constituency in Himachal Pradesh.

ప్రమాదానికి గురైన స్కూలుబస్సు.. 26 మంది చిన్నారుల మృతి

Posted: 04/09/2018 07:38 PM IST
20 students dead as school bus falls into gorge in himachal pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులను స్కూలు నుంచి ఇళ్లకు తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 26 మంది చిన్నారి విద్యార్థులు ఘటనాస్థలంలోనే అసువులు బాసారు. వీరితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. కాగా, ఈ దుర్ఘటనలో మరో  40 మంది విద్యార్ధులు గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని నుర్పుర్ లోని ఓ పాఠశాల బస్సు 60 మంది విద్యార్థులతో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూర్ పూర్ - చంబా రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు గుర్జాల్ గ్రామానికి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న 200 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు స్పందనా దళాన్ని రంగంలోకి దింపారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను వెలికి తీశారు. అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులోని విద్యార్థులంతా ఐదో తరగతి లోపు వారేనని సమాచారం. పాఠశాల నుంచి కాసేపట్లో ఇంటికి తిరిగి వస్తారనుకున్న చిన్నారులకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తమ చిన్నారుల క్షేమ సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఘటనా స్థలికి, ఆస్పత్రికి పరుగులు తీశారు.  కాగా, పాఠశాల బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టడంపై దిశానిర్దేశం చేశారు. క్షతగాత్రులైన చిన్నారులకు వెంటనే వైద్యసేవలు అందించాలని అదేశించారు. దీంతో పాటు ప్రమాదఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. మృతుల కుటంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wazir Ram Singh School  Nurpur  malkwal  himachal accicent  Dharamshala  School bus  george  Crime  

Other Articles