pawan kalyan key statement on Indian economy growth పర్యావరణంపై పాలకులకు శ్రద్ద ఏదీ: పవన్

Pawan kalyan key statement on ecomony growth and environment hazards

Jana sena, Pawan Kalyan, India, economy, pollution, environment, corruption, andhra pradesh, Telangana, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan says pollution less and corruption less society is the most essential for india than its gdp and economic growth.

స్వచ్ఛమైన గాలి, నీరు లేని అభివృద్ది ఎందుకు..?

Posted: 04/07/2018 10:20 AM IST
Pawan kalyan key statement on ecomony growth and environment hazards

స్వచ్ఛమైన గాలీ, నీరు ప్రజలకు లేకుండా చేసే అభివృద్ది ఎవరి కోసం.. ఎందుకోసమని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కలుషిత పరిశ్రమలను దేశంలో ఏర్పాటు చేయడం వల్ల అనేక కొత్త వ్యాధ్యులు, అరోగ్యసమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దేశం జీడీపీ రేటు పెరిగిందని, ప్రపంచ దేశాలలోనే టాప్ దేశాల సరసన వున్నామని మనకు మనం భజన చేసుకోవడం వల్ల లాభాం ఏమిటని అయన ప్రశ్నించారు.

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశమంతా స్వచ్ఛమైన గాలి కూడా లేక ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేకువ జామున వాకింగ్ చేసినా అనారోగ్య సమస్యలు తలెత్తే స్థాయికి కాలుష్యం చేరి ప్రజారోగ్యాలపై కాటు వేస్తున్నా ఇంకా దేశం పురోగాభివృద్ది అంటూ ఉదరగొట్టడం ఎందుకని.. ఎవరికోసమని ఆయన నిలదీశారు. ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును తీసుకోవాలని అన్నారు. ఆ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని... కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా మాకు లేకుండా చేస్తున్నారని వారు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.

ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతలు చేస్తున్న ప్రయోగాలు వ్యవస్థ పట్ల శాపాలుగా మారుతున్నాయిన పవన్ అవేదన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, స్థిరంగా లేని ఆర్థిక ఎదుగుదల, బలహీనవర్గాలపై బలంగా పని చేసే చట్టాలు, బలంగా ఉన్నవారిపై బలహీనంగా పని చేసే చట్టాలు ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే... ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారతదేశ ఎకానమీ, వ్యవస్థ లోపాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు, ప్రపంచ వేదికపై ఇండియా మెరుస్తూ ఉండవచ్చు... కానీ రాజకీయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి దేశాన్ని దిగజార్చుతోందని ఆయన అన్నారు. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం మన వ్యవస్థను నాశనం చేస్తోందని తెలిపారు. అవినీతే లేని సమాజం కోసం నేతలు పాటుపడాలని, అభివృద్దికి కొంచెం జరిగినా అది దేశాన్ని ముందంజలో నిలబెడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  India  economy  pollution  environment  corruption  andhra pradesh  Telangana  politics  

Other Articles