Rahul hits back at Modi over his Ambedkar remarks ప్రధాని వ్యాఖ్యలను రాహుల్ తిప్పికోట్టిన విధంబెట్టిదనిన..

Rahul gandhi hits back at modi over his ambedkar remarks calls pm s ideology oppressive

Rahul Gandhi, Congress president , PM Modi, BR Ambedkar, Dalits, MPs, BJP-RSS, Tumukuru, congress activist, Road Show, Assembly elections, karnataka, India

Congress president Rahul Gandhi today hit back at Prime Minister Narendra Modi for his recent remark that no government had honoured Dalit icon, BR Ambedkar, as the present NDA regime had.

ప్రధాని వ్యాఖ్యలను రాహుల్ తిప్పికోట్టిన విధంబెట్టిదనిన..

Posted: 04/06/2018 04:44 PM IST
Rahul gandhi hits back at modi over his ambedkar remarks calls pm s ideology oppressive

భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు తాము ఇచ్చినంత గౌరవం గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని మాటలతో కాకుండా చేతలతో తిప్పికోట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ. పార్లమెంట్‌ హౌస్‌ లో ఎంపీల వసతి కోసం నిర్మిస్తున్న వెస్ట్రన్‌ కోర్ట్‌ ఎన్నెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ప్రధాని విపక్షాలపై తీవ్ర విమర్శలు చేయడం పట్ల రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ ను గౌరవించే విషయంలో బీజేపీ అవలంభిస్తున్న విధానాలను చూడండంటూ ఆయన కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

దేశంలోని బీజేపి-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అత్యంత గౌరవ మర్యాదలు అందుతున్నాయని.. అవి ఇలాగేనా అంటూ.. దేశవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల తాలుకూ ఆ ఫోటోలను పెడుతూ, ‘బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ పాలిత దేశంలో అంబేద్కర్ కు దక్కిన గౌరవాన్ని చూడండి. అంటూ పోస్టు చేశారు. దేశంలోని దళితులను, అంబేద్కర్ ను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ లు ఎన్నటికీ గౌరవించవని పేర్కొన్నారు. రాజ్యాంగ పితను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ, ముందు అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసానికి గురికాకుండా చూసుకోవాలి' అని హితవు పలికారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు కాంగ్రెస్ పార్టీకే అందులోనూ సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని ఇప్పటికే నిర్థారించుకున్నారని ప్రీపోల్ సర్వేలు వెల్లడించడంతో..  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రచారం జోరుగా మరింత పెంచుతూ రోడ్‌షోలు, సభలతో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ముందుకుసాగుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అయనకు సంబంధించిన ఓ వీడియో ఆయన భద్రతలో వున్న డొల్లతనాన్ని భయపెడుతున్నా.. పార్టీ అభిమాని తనపై చూపిన అభిమానపు వీడియో మాత్రం వైరల్ గా మారుతుంది.

తుముకూరులో రాహుల్‌గాంధీ క్రితం రోజున ఓ ఎత్తైన వాహనంలో నిల్చోని రోడ్‌షో నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని విసిరిన పూల దండ నేరుగా రాహుల్ గాంధీ వైపు దూసుకెళ్లి.. ఆయన మెడలో పడింది. ఎవరో ముందుండి చాలా శ్రద్ధగా మెడలో వేసినట్లు ఆ పూలమాల పడటంతో ఒక్కసారిగా రాహుల్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ పూలమాలను తొలగించి అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్ షోను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్‌ నేతలు సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles