pawan kalyan demands special corporation for relly caste రెల్లీ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాన్

Pawan kalyan demands special corporation for relly caste

pawan kalyan, janasena, vijayawada, relly caste, relli caste, special corporation, guntur, guntur, doctors, hepetitis, dehydration, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan demands special corporation for relly caste for their development in employment and business oppurtunities, as they are not given priority even in political feild.

రెల్లీ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాన్

Posted: 04/05/2018 10:38 AM IST
Pawan kalyan demands special corporation for relly caste

ఎస్సీ సామాజిక వర్గంలో భాగమైన రెల్లి కులస్తులు ఉద్యోగ, ఉపాది సహా వ్యాపార, రాజకీయ రంగాల్లోనూ వెనుకబాటుకు గురవుతున్నారని, ఈ కులస్థుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెల్లి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తనకు అవగాహన ఉందని అన్నారు. రెల్లి సామాజిక వర్గ యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన, వ్యాపార రంగంలో నిలదొక్కుకునే కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారిని రుణాలను అందజేయాలని అయన డిమాండ్ చేశారు.

రెల్లి కులస్తులు విద్య, ఉపాధి రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  ఈ సామాజికవర్గ అభివృద్ది కోసం జనసేన పార్టీ పక్షాన నిర్దిష్టమైన విధానాలు రూపొందిస్తుందని చెప్పారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని రెల్లి కుల సంఘం ప్రతినిధులు కలసి.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని, జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 లక్షల మంది రెల్లి, సంబంధిత కులస్తులు ఉన్నారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులుగా, మలమూత్రాలు ఎత్తివేసే వృత్తుల్లోనే ఉండటంతో సామాజిక వెనకబాటుతనంతో అనేక ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పారు.

ఇక వేసవి కాలప్రారంభంలోనే అతిసారం, హెపటైటిస్ వ్యాధులు వ్యాప్తి చెంది.. గుంటూరు నగరంలో మరణాలు సంభవించిన నేపథ్యంలో గుంటూరుకు చెందిన 40 మంది వైద్యులతో కూడిన బృందంతో ఆయన ఆయన కలిసారు. ఇప్పుడే పరిస్థితులు ఇలా వుంటే రానున్న వర్షాకాలంలో ఎలా వుంటాయోనన్న అందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ సమస్యలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. కాగా, ప్రస్తుతం గుంటూరు నగరంలో హెపటైటిస్ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు ఈ సందర్భంగా పవన్ కల్యాన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన పవన్.. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన తరఫున వైద్యుల బృందంతో ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని వారికి చెప్పారు. ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తుంచుకునేలా ఒత్తిడి పెంచుతామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అన్నారు. కాగా, కలుషితమైన నీటిని తాగడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు, మంచినీటి పైపుల వెంబడే మురుగు నీరు వెళ్లే గొట్టాలు ఉన్నాయని దీని మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. తాగునీటిని పలు దశల్లో శుద్ధి చేసి సరఫరా చేయాల్సిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉందని చెప్పారు. ప్రజారోగ్య సంరక్షణలో ప్రభుత్వాలు ముందుండాలని లేని పక్షంలో అది ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles