'Computer Baba' thankful to MP Govt for granting MoS rank బాబాలకు మంత్రి హోదాలు.. మధ్యప్రదేశ్ సర్కారు మార్కు రాజకీయం

Computer baba thankful to mp govt for granting mos rank

madhya pradesh minister of state, religious leaders minister of state, computer baba, bhaiyyuji maharaj, narmadanandji, hariharanandji, pt yogendra mahant, who is computer baba, who is yogendra mahant, shivraj singh chouhan, narmada sewa yatra,narmada scam

Computer Baba, who is among the five religious leaders who were granted the Minister of State (MoS) rank by the Shivraj Singh Chouhan-led cabinet, on Wednesday thanked the Madhya Pradesh government for the same.

బాబాలకు మంత్రి హోదాలు.. మధ్యప్రదేశ్ సర్కారు మార్కు రాజకీయం

Posted: 04/04/2018 04:58 PM IST
Computer baba thankful to mp govt for granting mos rank

మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత గురువులుగా వెలుగొందుతున్న అయిదుగురు బాబాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘సహాయ మంత్రి’ హోదా కల్పించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నర్మదా నదీ పరిరక్షణ పేరుతో జరుగుతున్న కుంభకోణాలను బయటపెట్టేందుకు, అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని డిమాండ్ తో రథయాత్ర చేపడతామని బాబాలు ప్రకటించిన నేపథ్యంలో వారినే కమిటీ సభ్యులు ప్రకటించిన ప్రభుత్వం.. వారికి సహాయమంత్రి హోదాను ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నర్మదానంద్ మహారాజ్‌, హరిహరానంద్ మహారాజ్‌, కంప్యూటర్ బాబా, భయ్యు మహారాజ్‌, పండిట్ యోగేంద్ర మహంత్ లకు ప్రభుత్వం ఈ హోదా కల్పించింది. వీర రథయాత్ర నేపథ్యంలో మార్చి 31న ప్రభుత్వం హడావిడిగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే బాబాలకు మంత్రి హోదా ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తోంది. కేవలం బాబాలు రథయాత్ర చేస్తారన్న క్రమంలో ప్రభుత్వానికి నర్మదా నది పరిరక్షణ గుర్తుకువచ్చిందా..? అని ప్రశ్నిస్తోంది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేసిందని, ఎన్నికల్లో  బాబాల అనుచరుల మద్దతు కోసం వారికి ఈ హోదా కల్పించిందని ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి నర్మద పరిరక్షణ విస్మరించారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి బాబాలకు మంత్రి హోదాలు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ యూనిట్‌ అధికార ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది విమర్శించారు.

ఇదిలావుండగా, రథయాత్ర చేపట్టాల్సిన అవసరం ఇక తమకు లేదని, ప్రభుత్వమే కమిటీని వేసిన క్రమంలో.. దాని పరిరక్షణ బాధ్యతల కమిటీలో తమను కూడా సభ్యులను చేసినందుకు గాను ఇక యాత్ర కాకుండా నదీ పరిరక్షణకు చర్యలు చేపడతామని అన్నారు. ఇక తనకు రాష్ట్రమంత్రి హోదా కల్పించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కంప్యూటర్ బాబా కృతజ్ఞతలు తెలిపారు. కంప్యూటర్ బాబా సహా మొత్తం ఐదుగురు హిందూ సాధువులకు కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కంప్యూటర్ బాబా స్పందిస్తూ... ‘‘మాపై నమ్మకం ఉంచినందుకు సాధువుల సమాజం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సమాజ శ్రేయోభివృద్ధి కోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం...’’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles