Government job is not like distribution of biscuits: VK Singh ‘‘ఉద్యోగాలు, పరిహార ప్రకటన అంటే బిస్కెట్ల పంఫిణీ కాదు’’

Relief jobs for victims kin not same as distributing biscuits vk singh

38 Indian bodies, Iraq, VK Singh, Terrorism, Middle East, Islam, Terrorism in Iraq, Levant, Mosul, Islamic State of Iraq and the Levant, Iraq, Battle of Mosul, Union Minister, Centre government, Congress, Punjab, India, Minister of State for External, indians deceased in iraq, terrorism, isis, punjab, government jobs, compensation

Union Minister of State for External Affairs Vijay Kumar Singh, responded when asked about conpensation and jobs to deceased families, "This is not like distributing biscuits, I do not have like a box of money in my pocket that I'll just declare the compensation right now, this matter concerns people's lives,"

‘‘ఉద్యోగాలు, పరిహార ప్రకటన అంటే బిస్కెట్ల పంఫిణీ కాదు’’

Posted: 04/03/2018 11:17 AM IST
Relief jobs for victims kin not same as distributing biscuits vk singh

కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యకాలంలో లండన్ లో తలదాచుకున్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావడం అంత సులువైన పనికాదని చెప్పిన మంత్రి.. ఇక తాజాగా పొట్టకూటి కోసం విదేశాలకు తరలివెళ్లి.. నిత్యం రావణకాష్టంగా రగులుతున్న ఇరాక్ దేశంలో.. కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన భారతీయుల మృతదేహాలను భారత్ తీసుకువచ్చిన అనంతరం ఆయన మీడియాతో వివరాలు తెలుపుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే బిస్కెట్ల పంపిణీ కాదంటూ మీడియాపైనే రుసరుసలాడారు.

విపత్తులు సంభవించినప్పుడు.. లేక అలజడుల్లో మృతిచెందిన వారికో ప్రభుత్వం పరిహారాన్ని ముందుగా ప్రకటించి.. మృతుల కుటుంబాలకు తాము అండగా వున్నమన్నా ధైర్యాన్ని అందిస్తుంది. కానీ ఇరాక్ లో ఉగ్రవాదుల చేతితో హతులైన భారతీయుల విషయంలో మాత్రం కేంద్రం ఎంత పరిహారం ప్రకటించిందన్న వివరాలు తెలియరాలేదు. ఇదే విషయమై కేంద్ర మంత్రిని అడిగిన మీడియాకు ఆయన కప్పదాటు సమాధానాలే ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులతో పాటు వారి విద్యార్హతలను తెలియజేస్తూ.. వివరాలను తమకు అందించాలని కోరామని, వారి అర్హతలమేరకు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తామన్నారు.

అయితే బాధిత కుటుంబాలకు ఉద్యోగాల కల్పన బాధ్యతను కేంద్రం తీసుకుంటుందా..? లేక రాష్ట్రం తీసుకోవాలా అన్న ప్రశ్నపై స్పందించిన ఆయన భారత దేశం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఎంత మేరకు పరిహారాన్ని ప్రకటిస్తున్నారు అన్న మీడియా ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇదేమీ ఫుట్‌బాల్ ఆటకాదు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే బిస్కెట్ల పంపిణీ కాదని తేల్చి చెప్పారు. ఇదేదో తన జేబులోంచి ఓ బాక్సు తీసి పరిహారాన్ని పంచాలంటే సాధ్యమయ్యే పనికాదని.. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో తానెలా ప్రకటన చేస్తానని పేర్కొన్న మంత్రి, అసలు మీకు అర్థమవుతోందా? అంటూ మీడియాపైనే అసహనం వ్యక్తం చేశారు.

ఇరాక్ లో మృతి చెందిన 39 మందిలో 38 మంది భారతీయుల మృతదేహాలతో బాగ్దాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం సోమవారం మధ్యాహ్నం 2:30లకు అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది. మృతి చెందిన వారిలో మరొకరిని గుర్తించాల్సి ఉంది. 2014లో పని కోసం ఇరాక్ వెళ్లిన 40 మందిని మోసుల్‌లో ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వీరి చెర నుంచి ఒకరు తప్పించుకోగా మిగతా 39 మందిని ఉగ్రవాదులు హతమార్చారు. మొత్తం 40 మందిలో 27 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా, మిగతావారు హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union minister  vk singh  indians deceased in iraq  terrorism  isis  punjab  government jobs  compensation  

Other Articles