No Problem Stripping Before "White Man": Union minister దేశప్రజలను అవమానించిలా కేంద్రమంత్రుల వ్యాఖ్యలు

People question aadhaar but strip before white men for visa union minister

Aadhaar, UIDAI, Aadhaar data, KJ Alphons, Visa, Tourism minister, Aadhaar leak, US visa, PM Modi, politics

Union minister of state for tourism, KJ Alphons, hit out at Aadhaar detractors, stating that people opposed their government when it sought “basic details” but had no qualms in stripping before the “white men” at airports abroad.

వ్యూహాత్మకంగా ఆధార్ పై అన్నివర్గాలను టార్గెట్ చేసిన కేంద్రం..

Posted: 03/26/2018 09:58 AM IST
People question aadhaar but strip before white men for visa union minister

అధికారంలోకి వచ్చాక విలువ తెలుసుకున్న బీజేపి నేతలు.. ఐదేళ్ల క్రితం తీవ్రంగా వ్యతిరేకించిన ఆధార్ కార్డును ఇప్పుడు తమ భుజస్కంధాలపై వేసుకుని మరీ అన్నింటికీ దానినే అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల లాభాలు వున్నాయని, ప్రభుత్వ సంక్షేప పథకాలు గట్రా పక్కదారి పట్టకుండా సక్రమంగా మంజూరవుతాయని కేంద్రప్రభుత్వం వాదిస్తుంది. ఈ క్రమంలో అడుగుముందుకేసిన కేంద్రమంత్రులు.. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎంతలా అంటే దేశప్రజలనే అవమానించేస్థాయికి దిగజారి మరీ అధార్ కోసమే తాము వున్నట్లు వ్యవహరిస్తూ.. తీవ్రవ్యాఖ్యలను చేస్తున్నారు.

ఇటీవలే ఓ కేంద్రమంత్రి దేశప్రజలకు తినడానికే తిండిలేదు.. కానీ వ్యక్తిగత గోప్యతకు చోటెక్కడిదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ అంతకంటే దారుణ వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకరు పేదలను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. మరోకరు మాత్రం దేశంలోని మధ్య, సంపన్నవర్గాలను టార్గెట్ చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఫేస్ బుక్ తమ వద్దనున్న డాటాలను అక్రమంగా అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచారసమయంలో వినియోగించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో.. ఆధార్ డేటాబేస్ కు రక్షణ కల్పించాలన్న డిమాండ్ పెరిగింది.

అయితే దీనిపై అసహనం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కేజే అల్పోన్స్..  ఆందోళన చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. ఆధార్ ను ప్రశ్నించే వారు వీసా కోసం తెల్లవారి ముందు నగ్నంగా నిలబడడానికి కూడా సిద్ధం అయిపోతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీసాలు లేకపోతే తమ జీవితానికే అర్థం లేదని భావించే వారు.. గుడ్డలు ఇప్పేందుకు కూడా రెడీ అంటారని ఆక్షేపించారు. అదే ఆధార్ విషయానికి వచ్చే సరికి  సమాచారం ఇమ్మంటే చాలు.. పెను విప్లవం వచ్చేస్తుందని ఎద్దేవా చేశారు.

‘‘అమెరికా వీసా కోసం తాను కూడా పది పేజీల దరఖాస్తు నింపానని అన్నారు. అయితే వీసా పొందేందుకు మాత్రం.. అక్కడి వారికి మన చేతి వేలిముద్రలు ఇవ్వడానికి, తెల్లవాడి ముందు నగ్నంగా నిలబడడానికి సిద్ధమవుతా.. కానీ మన సొంత ప్రభుత్వానికి వివరాలు ఇవ్వడానికి మాత్రం అక్షేపిస్తామన్నారు. ఇక్కడ పేరు, అడ్రస్ మాత్రమే ఇస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అయినాకానీ మన ప్రభుత్వం ఏదో చేసేస్తుందని, వ్యక్తిగత గోప్యత దేశ పౌరుల హక్కు అంటూ.. ప్రభుత్వం వ్యక్తిగత గోప్యత విషయంలో తలదూరుస్తుందంటూ పెను విప్లవాన్ని తీసుకువచ్చేస్తారంటూ ఆయన విరుచుకుపడ్డారు.

అయితే వ్యక్తిగత గోప్యత పౌరుల హక్కు అన్న దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన అత్యున్నత తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఆయన తూలనాడుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయంలో తాము తుది తీర్పు వెలువరించే వరకు ఎవరన్ని ఎలాంటి సమాచారం ఇవ్వాలని కానీ, అధార్ కార్డులతో అనుసంధానం చేయాలని కానీ డిమాండ్ చేయవద్దని, అధార్ తో లింకు చేయడానికి తుది సమయమంటూ ఏదీ లేదని కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ‘ఉడాయ్’ వద్దనున్న సమాచారాన్ని తస్కరించడం సాధ్యమయ్యేపని కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar  UIDAI  Aadhaar data  KJ Alphons  Visa  Tourism minister  Aadhaar leak  US visa  PM Modi  politics  

Other Articles