Anna Hazare begins indefinite hunger strike నిరాహారదీక్షను ప్రారంభించిన అన్నా హజారే

Anna hazare begins indefinite hunger strike in delhi

Anna Hazare, social acitivist, Lokayuktas, indefinite hunger strike, delhi traffic police, anti corruption movement

Social activist Anna Hazare, begins indefinite hunger strike demanding for a Lokpal, hit out at the government’s “sly attitude” and accused it of cancelling trains carrying protestors to New Delhi.

హస్తినలో అన్నా హాజరే నిరాహరదీక్ష.. కేంద్రం ఎదుట మూడు డిమాండ్లు

Posted: 03/23/2018 11:51 AM IST
Anna hazare begins indefinite hunger strike in delhi

అవినీతి రహిత భారత్ సాధనే తన ధ్యేయంగా పెట్టుకున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే.. ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదానంలో ఇవాళ ఉదయం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో దీక్ష ప్రారంభమైంది.  కేంద్రంలో లోక్‌ పాల్‌ బిల్లు అమలు, రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకం, దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడం కోసం స్వామినాథన్‌ సిఫారస్సులు అమలు చేయాలన్న మూడు డిమాండ్‌ లతో ఆయన ఈసారి నిరాహార దీక్ష చేపట్టారు. 2011లో ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన ఇక్కడి నుంచే నిర్వహించిన విషయం తెలిసిందే.
 
ఇవాళ ఉదయం ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్దకు చేరుకున్న అన్నా హజారే ఆయనకు ఘననివాళులర్పించారు. ఆ తరువాత ఆయన దేశ భక్తులు, త్యాగధనులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల బలిదానాలను ఆయన గుర్తుచేసుకున్నారు. బ్రిటిష్ పరిపాలకులు మార్చి 23న ఉరి తీసిన నేపథ్యంలో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. తన నిరవధిక నిరాహార దీక్షకు ఈరోజును ఎంపిక చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తన మద్దతుదారులు ఢిల్లీకి తరలి రాకుండా అడ్డుకునేందుకు రైళ్ళను రద్దు చేశారని ఆరోపించారు. హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారన్నారు. తన చుట్టూ పోలీసు బలగాలను మోహరించారన్నారు. తనకు పోలీసు రక్షణ అవసరం లేదని తాను చాలాసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. మీరు కల్పించే భద్రత నన్ను కాపాడబోదని చెప్పానన్నారు. ప్రభుత్వ వైఖరి సరైనది కాదని దుయ్యబట్టారు.
 
కాగా, కేంద్ర ప్రభుత్వం లోక్‌ పాల్‌ బిల్లును అమలు చేసేంత వరకు నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులే ఈ దేశానికి వెన్నుముక్క అని చెబుతున్న ప్రభుత్వం వారి సంక్షేమం కోసం మాత్రం పాటుపడటం లేదని అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా తాను ప్రధాన మంత్రి మోడీకి రాసీన ఎన్నో లేఖలకు ఇప్పటివరకూ సమాధానమే రాలేదని, ఈ క్రమంలో తాను ఈ మూడు డిమాండ్లను కేంద్రం ఎదుట పెట్టి నిరాహారదీక్షకు పూనుకున్నట్లు చెప్పారు.

You cancelled trains carrying protesters to #Delhi, you want to push them to violence. Police Force deployed for me as well. I wrote in many letters that I don't need police protection. Your protection won't save me. This sly attitude of the government is not done: Anna Hazare pic.twitter.com/Ue91oXsnzG

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles