Arun jaitley calls chandrababu, promises to fulfill all promises జైట్లీ ఫోన్.. ఏంచేద్దాం.. పార్టీ ముఖ్యనేతల చంద్రబాబు చర్చ

Arun jaitley calls chandrababu promises to fulfill all promises

Arun jaitley, chandrababu, state bifurcation bill promises, PM Modi, Amit shah, operation garuda, andhra pradesh, politics

After actor Sivaji and BJP IT Cell founder Prodyut Bora made sensational comments on PM Modi and Amit Shah, centre bends down to chandrababu. Union Minister Arun jaitley calls AP CM and asks him to come to delhi in fulfilling all the promises of state bifurcation bill.

జైట్లీ ఫోన్.. ఏంచేద్దాం.. పార్టీ ముఖ్యనేతల చంద్రబాబు చర్చ

Posted: 03/23/2018 10:52 AM IST
Arun jaitley calls chandrababu promises to fulfill all promises

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాల మేరకు అటు హస్తినలో టీడీపీ ఎంపీలు వరుసగా ఆరు రోజుల పాటు ఇస్తున్న అవిశ్వాస తీర్మాణం నేపథ్యంతో పాటు.. ఇటు రాష్ట్రంలో బీజేపిని ఎక్కడికక్కడ దోషిగా నిలబట్టేందుకు చేస్తున్న ప్రకటనలు, ప్రచారాల నేపథ్యంలో రాష్ట్రంలో కమలం వికసించే అవకాశాలు లేవన్న తరుణంలో ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం దిగివచ్చింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన అరోపణలు, విమర్శల పోరులో బీజేపిపై చంద్రబాబు పైచేయి సాధించారు.

ఈ క్రమంలో రాష్ట్ర విభజన చట్టంలో పోందుపర్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం.. మీరు ఓ పర్యాయం హస్తినకు రావాలని కేంద్రం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అయితే ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ప్రత్యేక హోదాను మాత్రం అసలు ప్రస్తావనకే తీసుకురాలేదని అన్నారు. అయితే విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారని తెలిపారు. ఈ తరుణంలో మనం ఏం చేద్దామని అయన పార్టీ ముఖ్యనేతల ముందు ఈ అంశాన్ని పెట్టి చర్చించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రతీక్షణం అప్రమత్తంగా వుండాలంటూ ఆయన సూచనలు ఇచ్చారు. కేంద్రం మనకివ్వాల్సిన నిధులపై కోతలు పెడుతూ.. ఇతర రాష్ట్రాలకు మాత్రం ధారాళంగానే నిధులను విధుల్చుతుందని అన్నారు. రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తమకు ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే, యూపీఏలపై కోపం లేదని... ఏపీకి జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయనేదే తన అవేదన అని అన్నారు.

ఈ టెలికాన్ఫరేన్స్ సమావేశం సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీలన్నింటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. వీటి విషయంలో ఇటు మనకు ఒకటి చెబుతూ.. అటు ప్రజల్లోకి మరోటికి తీసుకెళ్లిన కేంద్రమే స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యతని అన్నారు. ఇక ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో మనం కేంద్రం క్లారిటీ ఇచ్చిన తరువాతే వెళ్లాలని యనమల చెప్పారు. ఓ వైపు అవిశ్వాస తీర్మాణాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్రమంత్రులతో సమావేశం కావడం సమంజసం కాదని అన్నారు.

ఇలాంటి పరిణామాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తాయని చెప్పారు. కేంద్ర హామీలపై క్లారిటీ ఇచ్చిన పిమ్మట పార్లమెంటులో నిరసనలు అపిన తరువాత కేంద్రమంత్రులను కలసి సమావేశం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు ఎక్కడైనా కనిపిస్తే మర్యాదగా పలకరించుకోవడంలో తప్పు లేదని చెప్పారు. యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు. కేంద్రం క్లారిటీ ఇచ్చిన తరువాతే వెళ్దమని చెప్పారు. కాగా, హీరో శివాజీ వెల్లడించిన 'ఆపరేషన్ ద్రవిడ' గురించి పయ్యావుల, పల్లె రఘునాథరెడ్డిలు ప్రస్తావించగా... అన్నీ పరిశీలిద్దామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles